ఏపీ నూతన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం వైపు ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది. ఇప్పటికే తూర్పు తీరంలో ఎంతో చెన్నై పట్టణం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరాల్లో విశాఖపట్నం కూడా స్థానం పొందింది. ఇప్పటికే పలు పారిశ్రామిక సంస్థలు, మహారత్న, మినీరత్న, ఓడరేవు సహా అనేక సెంట్రల్ గవర్నమెంటు సంస్థలకు కేంద్ర స్థానంగా ఉన్న వైజాగ్ పట్టణం ప్రస్తుతం కాపిటల్ ప్రకటనతో ఊపందుకుంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ వచ్చింది. రియల్ దందాలో కొత్త జోష్ వచ్చింది. భూములు, ఇళ్ల ధరలకు రెక్కలు వస్తున్నాయి. అమరావతి నుంచి రాజధాని తరలి వస్తుందనే ఇళ్ల అద్దెలు కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదనతో ఇప్పటికే వైజాగ్ లోని పలు ప్రాంతాల్లో ప్లాట్లకు, అపార్ట్ మెంట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సీఎం జగన్ ప్రతిపాదించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు అందుకుంటోంది. భూముల ధరలు రెట్టింపు అవుతున్నాయి. భీమిలి నియోజకవర్గంలోని కాపులుప్పాడ, మధురవాడ మధ్య ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పడవచ్చన్న ప్రచారం నడుస్తుంది.
మరోవైపు విశాఖ నగరంలో ఇప్పటికే ఎం.వి.పి కాలనీ, సీతమ్మధార,కీర్లంపూడి లే అవుట్ , వుడా కాలనీ, దస్పల్లా హిల్స్ , విశాలాక్షి నగర్ లో ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే మద్దిలపాలెం, అక్కయ్యపాలెం, వన్ టౌన్ ఏరియా, కంచరపాలెం, మర్రిపాలెం లాంటి ఏరియాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి. రాజధాని షిఫ్ట్ అయితే రానున్న రోజుల్లో అపార్ట్ మెంట్ల కిరాయిలు మరింత పెరిగే అవకాశం వుందంటున్న నగరవాసులు భావిస్తున్నారు.
అయితే ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా ఎదుగుతున్న విశాఖ నగరంలో ఇల్లు, ఇంటి స్థలానికి ఎంతో డిమాండ్ ఉంది. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ మహా నగరంలో ఇప్పుడే ఇల్లు సొంతం చేసుకుంటే కాస్త తక్కవు ధరకే లభించే అవకాశం ఉందని అందరూ అటు వైపే దృష్టి సారించారు. రాజధానిలో ఇల్లు కొనాలని ఎంతో మంది కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ డెవలప్‌మెంట్స్, బ్యాంకు లోన్స్, విఎంఆర్‌డిఎ అప్రూవల్, రిజిస్ట్రేషన్ సౌకర్యాలతో గాజువాక ప్రాంతంలో అపార్ట్ మెంట్లు అతి తక్కువ ధరకే సిద్ధంగా ఉన్నాయి. ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతికి అనుబంధంగా ఉన్న విజయవాడ, గుంటూరు పట్టణాల్లోని అపార్టుమెంట్లతో పోల్చి చూస్తే...వైజాగ్ లో ఫ్లాట్స్ ధరలు కాస్త తక్కువే అన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో మిడిల్ క్లాస్ వర్గాలు రాజధానిలో స్థిరపడేందుకు కాస్త ఆశలు చిగురించాయి.
గాజువాక ప్రాంతంలో కొన్నేళ్లుగా స్థిరాస్తి వ్యాపారం స్థిరంగా కొనసాగుతోంది. గాజువాక ప్రాంతం పది కిలోమీటర్ల పరిధిలోనే హిందుస్థాన్ షిప్‌యార్డ్, నేవల్ డాక్‌యార్డ్, భెల్ హెచ్‌పీవీపీ, హెచ్‌పీసీఎల్, ఐఓసీ, ఎన్‌టీపీసీ, ఆంధ్ర పెట్రో కెమికల్స్, కోరమాండల్ ఫెర్టిలైజర్స్, హిందుజా పవర్ ప్లాంట్, గంగవరం పోర్టు, ఫార్మాసిటీ, ఎస్ఈజెడ్, విశాఖ డెయిరీ ఉండటం కలిసొచ్చే అంశాలు. కూర్మన్నపాలెం, షీలానగర్, పెదగంట్యాడ, చినగంట్యాడ, అగనంపూడి, అక్కిరెడ్డిపాలెం, దువ్వాడ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. గాజువాక ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ధరలు రూ. 20 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్యలో ఉన్నాయి. ముఖ్యంగా 2BHK ఫ్లాట్స్ ధరలు రూ.20 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతో ఎక్కువగా ఉద్యోగులు, పరిశ్రమల్లోని కార్మికులు ఈ ప్రాంతంలో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.