Home /News /business /

ANDHRA PRADESH GOVERNMENT RELEASED KEY ORDERS ON FINANCIAL ASSISTANCE TO FAMILIES OF COVID DECEASED FAMILIES NS

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున సాయం.. వివరాలివే

వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్)

వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్)

కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ సర్కార్ (AP Government) సిద్ధమైంది. ఒక్కో కుటుంబానికి రూ. 50 వేల చొప్పన ఆర్థిక సాయం అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరరకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
    కరోనా (Corona) మహమ్మారి కారణంగా ప్రాణాలను కోల్పోయిన (Corona Deaths) వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని సీఎం జగన్ (CM Jagan) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 50 వేలను అందించేందుకు సిద్ధమైంది. గతంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తు స్పందన నిధి(NDRF) నుంచి ఈ మెత్తాన్ని అందించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government). నిధులను మంజూరు చేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లకు సర్కార్ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు జగన్ సర్కార్ సోమవారం ఉత్తర్వులను సైతం జారీ చేసింది. డీఆర్వో ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు. ఆ సెల్ ద్వారా కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి దరఖాస్తును స్వీకరించనున్నారు. జిల్లా స్థాయిలో డీఆర్వో స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ బాధితుల నుంచి దరఖాస్తులను స్వీకరించి పరిశీలిస్తుంది. అనంతరం కలెక్టర్ కు ఆ దరఖాస్తులను సిఫార్సు చేస్తుంది. అనంతరం రెండు వారాల్లో బాధితులకు సాయం పంపిణీ చేస్తారు.

    డీఆర్వో నేతృత్వంలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ బాధిత కుటుంబీకుల నుంచి వచ్చిన దరఖాస్తును పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరమే కరోనా మృతిపై ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే కరోనాతో మరణిస్తారో వారి కుటుంబంలో వారి తర్వాత వారికి పరిహారం అందిస్తారు. అప్లికేషన్ ఫామ్ లో పేరు, చనిపోయిన వారితో బంధుత్వం, చనిపోయిన చోటు, చిరునామా, ఆధార్‌ సంఖ్య, ఆధార్‌ లింక్‌ చేసిన బ్యాంకు ఖాతా వివరాలు, డెత్ సర్టిఫికేట్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
    శుభవార్త: నేడు రైతుల ఖాతాల్లోకి రూ. 2190 కోట్లు -రెండో విడత YSR Rythu Bharosa-PM Kisan, మరో రెండు పథకాల డబ్బు

    ఇంకా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన పత్రం, సీడీఏసీ సర్టిఫికేట్, స్థానిక రిజిస్ట్రార్ చే మంజూరు చేయబడిన డెత్ సర్టిఫికేట్, ఆధార్ కాపీ జిరాక్స్, స్థానిక తహసీల్దార్ చే జారీ చేయబడిన ఫ్యామిలీ మెండర్ సర్టిఫికేట్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పై ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్‌ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు స్థానిక మెడికల్, రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు. గ్రామ, వార్డు సచివాలయల్లోనూ వివరాలను తెలుసుకోవచ్చు.
    Andhra Pradesh: రేపట్నుంచి రేషన్ షాపులు బంద్ -డీలర్ల సంఘం కీలక ప్రకటన.. పూర్తి వివరాలివే..

    ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా మరో 295 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,60,977కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,350 కరోనా మరణాలు సంభవించాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Corona, Corona deaths

    తదుపరి వార్తలు