హోమ్ /వార్తలు /బిజినెస్ /

AP CM Jagan: వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. పావులా వడ్డీకే రుణాలు

AP CM Jagan: వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. పావులా వడ్డీకే రుణాలు

సీఎం జగన్(ఫైల్ ఫొటో)

సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ బుధవారం స్పందన కార్యక్రమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జగనన్నకాలనీల్లో (Jagananna Colony) నిర్మించుకునే ఇళ్లపై లబ్ధిదారులకు పావులా వడ్డీపై రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు బ్యాంకర్లతో మాట్లాడాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇప్పటికే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు. అత్యవసర సమయాల్లో ఆ పట్టాలపై రుణం(Loan) తెచ్చుకునేలా వెసులుబాటు కల్పించినట్లు సీఎం తెలిపారు. అలా తీసుకునే రుణాలపై (Home Loans) లబ్ధిదారుడికి కేవలం పావలా వడ్డీ మాత్రమే పడుతుందని సీఎం స్పష్టం చేశారు. మిగతా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం భరోసానిచ్చారు. అయితే కొన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాల్లో వినియోగించే మెటల్ ధరలు భారీగా పెంచారని తమ దృష్టికి వచ్చిందని సీఎం అన్నారు. అధికారులు వెంటనే మెటల్ ధరలు నిర్ణయించాలని ఆదేశించారు. ఆ ధరలకు మించి అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం.

ఇంకా ఇళ్ల స్థలాల కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలన్నారు సీఎం. దరఖాస్తు చేసుకున్న వారికి త్వరగా పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 8 వేల దరఖాస్తుల పరిశీలనను సైతం వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో 10.11 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు. వీటి ప్రగతిపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. మొత్తం 15.60 లక్షల ఇళ్లను తమ ప్రభుత్వం నిర్మించబోతుందన్నారు.

CM Jagan: ఐదు రోజులు బ్రేక్ తీసుకుంటున్న సీఎం జగన్.. హాలిడే టూర్ ప్లాన్ కు కారణం అదేనా..?

90 రోజుల్లోగా పింఛన్లు, రేషన్ కార్డు పంపిణీ..

పింఛన్లు, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు మంజూరుకు సంబంధించి 21 రోజుల్లోగా దరఖాస్తుదారుల అర్హతను నిర్ధారించాలని సీఎం సూచించారు. 90 రోజుల్లోగా వాటిని మంజూరు చేయాలన్నారు. ఇంకా ఇళ్ల పట్టాలు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా. చేయూత తదితర పథకాలకు సంబంధించి ఎవరైనా దరఖాస్తు చేసుకోలేకపోతే ఇప్పుడు చేసుకోవాలన్నారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందో? రాదో తెలియదన్నారు. కానీ వైద్యులు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Agri Gold Money Credited: అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు జమ... ఈ పాపం వారిదే: సీఎం జగన్

రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) అందించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. దీంతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులపై సైతం అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. వారానికి ఒక సారి ఈ అంశంపై సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, Ap government, Ys jagan mohan reddy

ఉత్తమ కథలు