హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Loan: బ్రాహ్మణులకు రూ.2,00,000 బిజినెస్ లోన్... ఎలా అప్లై చేయాలంటే

Business Loan: బ్రాహ్మణులకు రూ.2,00,000 బిజినెస్ లోన్... ఎలా అప్లై చేయాలంటే

Business Loan: బ్రాహ్మణులకు రూ.2,00,000 బిజినెస్ లోన్... ఎలా అప్లై చేయాలంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Business Loan: బ్రాహ్మణులకు రూ.2,00,000 బిజినెస్ లోన్... ఎలా అప్లై చేయాలంటే (ప్రతీకాత్మక చిత్రం)

Business Loan | వ్యాపారాలు చేయాలనుకునే బ్రాహ్మణులకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బిజినెస్ లోన్ ఇస్తోంది. పేద, మధ్యతరగతి బ్రాహ్మణ వ్యాపారుల్ని ఆదుకోవడం కోసం ఈ రుణాలు ఇస్తోంది.

  ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్రాహ్మణులకు రుణాలు (Brahmin Loan) ఇస్తోంది. విజయనగరం బ్రాంచ్ ద్వారా బ్రాహ్మణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను ప్రోత్సహించేందుకు బ్రాహ్మణ ఆంట్రప్రెన్యూర్, బిజినెస్ లోన్ (Business Loan) పథకం ద్వారా రుణాలు ఇస్తోంది. 100 మందికి ఒక్కొక్కరికి రూ.2,00,000 చొప్పున మొత్తం రూ.2 కోట్ల రుణాలు మంజూరు చేయనుంది. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునేవారు లేదా ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నవారు ఈ బిజినెస్ లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు.

  ఔత్సాహిక వ్యాపారులు ఏప్రిల్ 30 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. విజయనగరంలోని వ్యాపారులు ఈ రుణాల కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, విజయనగరం బ్రాంచ్‌లో దరఖాస్తు చేయాలి. బ్రాంచ్ మేనేజర్ ఎంవీఎన్ మూర్తిని 8179725128 నెంబర్‌లో సంప్రదించవచ్చు. లేదా విజయనగరం తోటపాలెంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనుక ఉన్న బ్రాంచ్‌లో సంప్రదించాలి. ల్యాండ్‌లైన్ నెంబర్ 08922 228822 నెంబర్‌లో కూడా సంప్రదించవచ్చు.

  Business Idea: ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్... రూ.70,000 పెట్టుబడి చాలు

  ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ బ్రాంచ్‌ల ద్వారా మధ్యతరగతి బ్రాహ్మణ వర్గాలకు రుణాలను అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్. వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ రుణాలు తీసుకోవచ్చు.

  Post Office: పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఉన్నవారికి అలర్ట్... ఈ రూల్ పాటించాల్సిందే

  ఇక బ్రాహ్మణ వర్గంలోని పేదలను, మధ్యతరగతి వారిని పలు వర్గాలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. గతంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇక 2022-23 బడ్జెట్‌లో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.455 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Business Loan

  ఉత్తమ కథలు