Public sector banks merger: ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకు విలీనం...

ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకు ఇకపై కలిసి ఒకే బ్యాంకుగా కొనసాగనున్నాయి. ఈ విలీనంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వం బ్యాంకుగా ఈ విలీన బ్యాంకు అవతరించనుంది. కొత్త విలీనంతో బ్యాంకు బిజెనెస్ విలువ 14.6 లక్షలకు పెరగనుంది.

news18-telugu
Updated: August 30, 2019, 5:44 PM IST
Public sector banks merger: ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకు విలీనం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకు ఇకపై కలిసి ఒకే బ్యాంకుగా కొనసాగనున్నాయి. ఈ విలీనంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వం బ్యాంకుగా ఈ బ్యాంకు అవతరించనుంది. కొత్త విలీనంతో బ్యాంకు బిజెనెస్ విలువ 14.6 లక్షలకు పెరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి బ్యాంకింగ్ సంస్కరణలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక భేటీలో ప్రభుత్వం బ్యాంకుల విలీనంపై కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇందులో భాగంగా మొత్తం 27 ప్రభుత్వం బ్యాంకులను 12 బ్యాంకులుగా కుదిస్తూ విలీన ప్రతిపాదనలు తెలియజేశారు. ఇందులో భాగంగా మొత్తం 10 ప్రభుత్వరంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా విలీనం చేస్తూ నిర్ణయం తెలియజేశారు. బ్యాంకింగ్ రంగ సంస్కరణల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
Published by: Krishna Adithya
First published: August 30, 2019, 5:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading