హోమ్ /వార్తలు /బిజినెస్ /

Anant Ambani: రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్ లీడర్‌గా అనంత్ అంబానీ

Anant Ambani: రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్ లీడర్‌గా అనంత్ అంబానీ

Anant Ambani: రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్ లీడర్‌గా అనంత్ అంబానీ
(ప్రతీకాత్మక చిత్రం)

Anant Ambani: రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్ లీడర్‌గా అనంత్ అంబానీ (ప్రతీకాత్మక చిత్రం)

Anant Ambani | ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్‌ను లీడ్ చేయనున్నారు. రీటైల్ బిజినెస్‌ను ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, టెలికామ్ బిజినెస్‌ను కొడుకు ఆకాశ్ అంబానీ చూసుకుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముకేశ్ అంబానీ ఇటీవల తన వారసత్వ ప్రణాళికను ప్రకటించారు. రిలయన్స్ టెలికామ్ బిజినెస్‌కు ఆకాశ్ అంబానీ, రీటైల్ బిజినెస్‌కు ఇషా అంబానీ, న్యూ ఎనర్జీ యూనిట్‌కు అనంత్ అంబానీని లీడర్లుగా చేశారు. ఎప్పట్లాగే తన నాయకత్వంలో వీళ్లు ముందుకు సాగుతారని తెలిపారు. ప్రస్తుతం రిలయన్స్‌లో మూడు కీలక వ్యాపారాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆయిల్ రీఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్స్. రెండోది రీటైల్. మూడోది డిజిటల్ సర్వీసెస్. ఇందులోనే టెలికామ్ కూడా ఉంది. ఇక న్యూ ఎనర్జీ బిజినెస్‌కు ఆయిల్ టు కెమికల్ విభాగం పేరెంట్ కంపెనీగా ఉంటుంది.

ఆకాశ్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో, ఇషా అంబానీ రిటైల్‌లో నాయకత్వ పాత్రలు పోషిస్తున్నారని, అనంత్ అంబానీ కూడా ఎంతో ఉత్సాహంతో న్యూ ఎనర్జీ వ్యాపారంలో చేరారని, ఎక్కువ సమయం జామ్‌నగర్‌లోనే గడుపుతున్నారని ముకేశ్ అంబానీ గతంలో అన్నారు. రిలయన్స్ రెన్యువబుల్ ఎనర్జీ డైరెక్టర్‌గా అనంత్ సేవలందిస్తున్నారు. రెండు రోజుల క్రితం అనంత్ అంబానీ ఎంగేజ్‌మెంట్ జరిగింది. విరెన్ మర్చెంట్, శైల దంపతుల కూతురైన రాధికా మర్చంట్‌ను అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరి రోకా వేడుక (నిశ్చితార్థం) రాజస్తాన్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయంలో జరిగింది. అదే రోజు సాయంత్రం సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం త్వరలో జరగనుంది.

Insurance: కొత్త సంవత్సరంలో ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారా? జనవరి 1 నుంచి కొత్త రూల్స్

రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్

అనంత్ అంబానీ లీడ్ చేయబోతున్న రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్ విషయానికి వస్తే పునరుత్పాదక శక్తి కోసం గిగా ఫ్యాక్టరీలను నిర్మించడంతోపాటు హైడ్రోజన్ వ్యాపారంలోకి ప్రవేశించడం ప్రధాన లక్ష్యం. అనంత్ రాబోయే నెక్స్ట్-జెన్ వ్యాపారంలో చేరడంతో, జామ్‌నగర్‌లోని తమ గిగా ఫ్యాక్టరీలను సిద్ధం చేయడంలో వేగంగా పురోగతి సాధిస్తున్నామని రిలయన్స్ ఫ్యామిలీ డే సందర్భంగా ముకేశ్ అంబానీ అన్నారు.

Savings Scheme: గుడ్ న్యూస్... పొదుపు పథకాల్లో డబ్బులు దాచుకున్నవారికి భారీగా వడ్డీ పెంపు

భారతదేశంలో అతిపెద్ద, అత్యంత విలువైన కార్పోరేట్ నుంచి, రిలయన్స్ ఇప్పుడు భారతదేశంలో 'గ్రీనెస్ట్' కార్పోరేట్‌గా కూడా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూ ఎనర్జీ టీమ్ ముందు లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధనంలో భద్రత, స్వయం సమృద్ధిని సాధించే దిశగా న్యూ ఎనర్జీ టీమ్ పనిచేస్తుంది.

First published:

Tags: Akash Ambani, Anant Ambani and Radhika Merchant Wedding, Isha Ambani, Mukesh Ambani

ఉత్తమ కథలు