Anand Mahindra: దేశంలో లాక్ డౌన్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్... నవ్వులు పూయిస్తున్న వీడియో!

ఆనంద్ మహింద్ర

తాజాగా, ఆయన కరోనా లాక్డౌన్పై చేసిన ట్వీట్ వైరల్గా మారుతోంది. దేశంలో ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితిని గుర్తుచేస్తూ ఒక ఫన్నీ వీడియో షేర్ చేశారు.

  • Share this:
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. వివిధ సమకాలిన అంశాలపై స్పందిస్తూ ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటారు. అందులో కొన్ని విషయాలు నవ్వించేవి ఉంటే, మరికొన్ని ఆలోచింపజేసేవి ఉంటాయి. తాజాగా, ఆయన కరోనా లాక్డౌన్పై చేసిన ట్వీట్ వైరల్గా మారుతోంది. దేశంలో ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితిని గుర్తుచేస్తూ ఒక ఫన్నీ వీడియో షేర్ చేశారు. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. అయితే, కరోనా తీవ్రత తగ్గడంలో కొన్ని రాష్ట్రాలు సడలింపులు ఇస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఉన్నప్పటికీ ఆర్థిక నష్టం జరుగుతుందన్న కారణంగా క్రమంగా లాక్డౌన్ను ఎత్తేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో, లాక్డౌన్ పట్ల పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై ఆనంద్ మహీంద్రా వ్యంగ్యంగా సమాధానమిస్తూ ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియోను పరిశీలిస్తే.. వీడియోలో ఉన్న ఒక యువకుడు తలుపు గొళ్లానికి తాడు కట్టాడు. ఆ తాడుకు తాళం తగిలించి క్రిందకి, పైకి లాగుతున్నాడు. అవతలి వ్యక్తి ఏం చేస్తున్నావని సదరు యువకుడిని అడగ్గా.. లాక్–డౌన్ అంటూ సమాధానమిచ్చాడు. అంటే తాళాన్ని కిందకు లాగుతున్నాను అని వ్యంగ్యంగా చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లకు నవ్వులు పూయిస్తుంది.



నవ్వులు పూయిస్తున్న వీడియో..

కాగా, ప్రస్తుత పరిస్థితులకు ఈ వీడియో కరెక్ట్గా సరిపోతుందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నాడు. ఎప్పుడెప్పుడు లాక్డౌన్ ఎత్తేద్దామా అని పాలకులు ఆలోచిస్తున్నట్లు ఆయన వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. మరోవైపు కరోనా కష్టకాలంలోనూ ఇలా అందర్నీ నవ్విస్తున్న యువకుడిని ఆయన ప్రశంసించారు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ఏ కఠిన సందర్భాన్నైనా భారతీయులు హాస్యంగా మలుచుకోగలరు. ఈ కఠిన సమయంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా మంచిది. ఇది మనకు మానసికంగా ఎంతో సాంత్వన చేకూర్చుతుంది.” అని అన్నారు. కాగా, మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో కేవలం 24 గంటల్లోనే 82,000 వ్యూస్ దక్కించుకుంది.
Published by:Krishna Adithya
First published: