ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించిన ఆనంద్ మహీంద్రా... నెటిజన్ల ప్రశంసలు

#CutTheCrap : కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లా్స్టిక్‌ను నిషేధించాలని నిర్ణయం తీసుకోవడంతో... ఆనంద్ మహీంద్రా ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఆయన చేపట్టిన #CutTheCrap క్యాంపెయిన్‌కు మంచి స్పందన వస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 28, 2019, 10:35 AM IST
ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించిన ఆనంద్ మహీంద్రా... నెటిజన్ల ప్రశంసలు
ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించిన ఆనంద్ మహీంద్రా (Credit - Twitter - anand mahindra)
  • Share this:
సమాజంలో సమస్యలను ఎత్తిచూపుతూ... 2011లో రైజ్ ఇన్షియేటివ్స్ ప్రారంభించారు మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఆనంద్ మహీంద్రా. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా... ఇప్పటికే చాలా సామాజిక, పర్యావరణ అంశాల్ని లేవనెత్తింది ఈ కంపెనీ. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుంది. పిల్లలకు విద్య, మొక్కల పెంపకం ఇలా ఎన్నో అంశాలపై ఫోకస్ పెట్టింది రైజ్ ఇన్షియేటివ్స్. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటివరకూ కోటీ 60 లక్షల మొక్కలు నాటిన ఈ సంస్థ... గతేడాది 14 వేల టన్నుల వ్యర్థాల్ని రీసైక్లింగ్ చేసింది. ఈ సమాజిక ఉద్యమంలో మరింత మంచి చేరాలని కోరుతున్నారు ఆనంద్ మహీంద్రా.

తాజాగా ఆనంద్ మహీంద్రా #CutTheCrap అనే కొత్త క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించి డిజిటల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే దీన్ని 32వేల మంది లైక్ చెయ్యగా... 91 వేల ఇంప్రెషన్స్ దక్కాయి.

ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాల్ని వివరిస్తున్నారు. వేస్ట్ మేనేజ్‌మెంట్‌ అనేది మరింత సమర్థంగా అమలయ్యేలా చేస్తున్నారు. అలాగే... రీసైక్లింగ్ ప్రక్రియ కూడా ఎక్కువ వ్యర్థాలకు జరిగేలా ప్రయత్నిస్తున్నారు.
First published: September 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు