ANAND MAHINDRA WAS IMPRESSED BY THE HANDICAPPED RICKSHAW DRIVER OFFERED A JOB MK
Anand Mahindra: దివ్యాంగుడుకి బంపర్ ఆఫర్ ఇఛ్చిన ఆనంద్ మహీంద్రా...వైరల్ వీడియో ట్వీట్ చేసి సహాయం...
ప్రతీకాత్మకచిత్రం
దేశ రాజధానిలో రెండు కాళ్లు, రెండు చేతులు లేని ఒక దివ్యాంగుడు తనకు అనుకూలంగా మోటర్ సైకిల్ రిక్షాను మోడిఫైడ్ చేసుకొని దాన్ని నడుపుతూ కుటుంబ భారాన్ని, బతుకు చక్రాన్ని సాగిస్తున్న వైరల్ వీడియో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది.
Anand Mahindra: సంకల్పం ఉంటే సాధ్యం కానిది అంటూ ఏది లేదు. జీవించాలి అనే ఒక బలమైన సంకల్పం ఉంటే చాలు ఎంతటి అసాధ్యాన్ని అయిన సుసాధ్యం చేయగలమని ఢిల్లీకి చెందిన ఒక దివ్యాంగుడు నిరూపించాడు. తాజాగా దేశ రాజధానిలో రెండు కాళ్లు, రెండు చేతులు లేని ఒక దివ్యాంగుడు తనకు అనుకూలంగా మోటర్ సైకిల్ రిక్షాను మోడిఫైడ్ చేసుకొని దాన్ని నడుపుతూ కుటుంబ భారాన్ని, బతుకు చక్రాన్ని సాగిస్తున్న వైరల్ వీడియో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. వెంటనే ఆయన ఆ వీడియోను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆయన ఇలా వ్రాశారు, "ఈ రోజు నా టైమ్‌లైన్‌లో ఈ వీడియో నన్ను ఆశ్చర్యపరిచింది. బహుశా ఇది ఎంత పాతదో లేదా ఎక్కడితో కూడా నాకు తెలియదు. ఆ దివ్యాంగుడు తన వైకల్యాన్ని ఎదుర్కోవడమే కాదు, కృతజ్ఞతతో ఉన్న ఈ పెద్దమనిషిని చూసి నేను ఆశ్చర్యపోయాను." అంతేకాదు తన సహచరుడు రామ్, మహీంద్రా లాజిస్టిక్స్ హెడ్ ను ట్యాగ్ చేసి, “రామ్, లాస్ట్ మైల్ డెలివరీ కోసం మన కంపెనీలో అతన్ని బిజినెస్ అసోసియేట్‌గా చేయగలరా?” అని అడిగాడు. అందుకు ప్రతిగా ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై కంపెనీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ స్పందిస్తూ.. అతడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది.
Received this on my timeline today. Don’t know how old it is or where it’s from, but I’m awestruck by this gentleman who’s not just faced his disabilities but is GRATEFUL for what he has. Ram, can @Mahindralog_MLL make him a Business Associate for last mile delivery? pic.twitter.com/w3d63wEtvk
ఆనంద్ మహీంద్రా వీడియోలోని ఆ వ్యక్తి తన వైకల్యాన్ని ఒక లోపంగా తిరస్కరించిన తీరును చూసి ఆశ్చర్యపోయారు. పని పట్ల అతని నిబద్ధతకు ముగ్ధుడై, ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో వీడియోను పంచుకున్నాడు. అంతేకాదు తన కంపెనీలో అతనికి ఉద్యోగం ఇచ్చాడు.
అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ దివ్యాంగుడు ఒక వ్యక్తి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, కాళ్లు చేతులు, లేకుండా వాహనాన్ని ఎలా నియంత్రిస్తాడో, ఎలా నడుపుతున్నాడో వివరిస్తాడు. గత ఐదేళ్లుగా తాను తన వాహనాన్ని నడుపుతున్నానని తెలిపాడు. అంతేకాదు ఆ వాహనాన్ని తానే స్వయంగా స్కూటీ ఇంజన్ తో తయారు చేయించుకున్నానని, తనకు ఇద్దరు పిల్లలు, భార్య, ముసలి తండ్రి ఉన్నారు, తాను వారి కోసమే సంపాదిస్తున్నాని తెలిపాడు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.