హోమ్ /వార్తలు /బిజినెస్ /

Anand Mahindra: ఆ రూల్ అందరూ పాటించాల్సిందే.. ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి..

Anand Mahindra: ఆ రూల్ అందరూ పాటించాల్సిందే.. ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి..

ఆనంద్ మహీంద్రా(ఫైల్ ఫొటో)

ఆనంద్ మహీంద్రా(ఫైల్ ఫొటో)

Anand Mahindra: సైరస్​ మిస్త్రీ మరణం నేపథ్యంలో స్పందించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఒక ప్రతిజ్ఞ చేశారు. అలాగే, ఆ రూల్ అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టాటా సన్స్​ మాజీ ఛైర్మన్ సైరస్​ మిస్త్రీ (Cyrus Mistry) ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన సెప్టెంబర్ 4న మహారాష్ట్రలోని ముంబై (Mumbai) సమీపంలోని పాల్ఘర్​ (Palghar) జిల్లాలో చోటు చేసుకుంది. మిస్త్రీ తన మెర్సిడెస్‌లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి తిరిగి వస్తుండగా సూర్యా నది వంతెన దగ్గర కారు కంట్రోల్ తప్పింది. దాంతో కారు బలంగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయానికి మిస్త్రీ సీటు బెల్టు (Seat Belt) పెట్టుకోకుండా కారు వెనక సీట్‌లో కూర్చున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఒక ప్రతిజ్ఞ చేశారు. కారు వెనక సీట్‌లో కూర్చున్నా, తాను తప్పకుండా సీట్ బెల్ట్ ధరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

కారులో ప్రయాణిస్తున్నప్పుడు వెనక కూర్చున్నా లేదా ముందు కూర్చున్నా సేఫ్టీ బెల్ట్‌ను ధరించడం తప్పనిసరి అనే విషయాన్ని నొక్కి చెబుతూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. మహీంద్రా విజ్ఞప్తి మేరకు తాము కూడా కారులో ఉన్నప్పుడు తప్పనిసరిగా సేఫ్టీ బెల్ట్ ధరిస్తామని నెటిజన్లు ప్రతిజ్ఞ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మెర్సిడెస్ కారులో సైరస్ మిస్త్రీతో పాటు ప్రముఖ ముంబై గైనకాలజిస్ట్ డాక్టర్ అనహిత పండోల్, ఆమె భర్త డారియస్ పండోల్, అతని సోదరుడు జహంగీర్ పండోల్ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

అయితే ఈ దుర్ఘటనలో జహంగీర్ పండోల్ కూడా మరణించారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోల్ కారు వెనుక సీటులో కూర్చున్నారు. వారిద్దరూ కూడా సీటు బెల్ట్ ధరించలేదట. అందుకే వారి ప్రాణాలు పోయాయని తెలుస్తోంది. ఈ ఘటనతో కారు వెనక సీట్‌లో కూర్చున్నా సీటు బెల్ట్ ధరించడం ఎంత ముఖ్యమో స్పష్టమవుతోంది. ఇక సీట్ బెల్ట్ ధరించి ముందు సీట్స్‌లో కూర్చున్న మిగతా ఇద్దరూ బతికిపోయారు. వీరు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలనుకుంటున్నారా..? అయితే, ఈ స్కీమ్ మీ కోసమే..

ఈ ప్రమాదంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, తాను వెనుక సీటులో ప్రయాణించినా నిత్యం బెల్ట్ ధరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. తనలాగే ప్రతిజ్ఞ చేయమని ఇతరులకు కూడా విజ్ఞప్తి చేశారు "ఇలా చేస్తే మనమందరం మన కుటుంబాలకు రుణపడి ఉంటామని" తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. చాలా మంది ట్విట్టర్ యూజర్లు మహీంద్రా చెప్పినదానితో ఏకీభవిస్తున్నారు. మహీంద్రా సార్‌ చెప్పింది ముమ్మాటికీ నిజమని, కారులో ప్రయాణిస్తున్నప్పుడు సేఫ్టీ కోసం ఎల్లవేళలా సీట్ బెల్ట్ ధరించాలని అంటున్నారు.

డ్రైవింగ్ చేసేటప్పుడు తక్కువ స్పీడ్‌తో వెళ్లడం, సీట్ బెల్ట్ ధరించడం ముఖ్యమని కామెంట్ చేస్తున్నారు. లేదంటే ప్రమాద సమయంలో మన శరీరం అనేది కారు క్యాబిన్ లోపల బలంగా గుద్దుకొని తీవ్ర ప్రమాదాలయ్యి చనిపోయే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు. అందుకే ప్రయాణ సమయంలో సీట్ బెల్ట్ తప్పదని ధరిస్తామని నెటిజన్లు కూడా ప్రతిజ్ఞ చేశారు. ఇక 54 ఏళ్ల మిస్త్రీ అకాల మరణంతో భారతదేశ వ్యాప్తంగా వ్యాపార, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Anand mahindra, BUSINESS NEWS, Car accident, Tata Group

ఉత్తమ కథలు