మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ పదవి నుంచి ఆనంద్ మహీంద్ర విరమణ

ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో సంస్థను విజయపథంలో నడిపించిన ఆనంద్ మహీంద్రా సెబీ మార్గదర్శకాల నేపథ్యంలో మహీంద్రా గ్రూపు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బోర్డు ఆమోదం తెలిపిందందని ఎం అండ్‌ ఎండ్‌ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్ లో తెలిపింది.

news18-telugu
Updated: December 20, 2019, 5:35 PM IST
మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ పదవి నుంచి ఆనంద్ మహీంద్ర విరమణ
ఆనంద్ మహీంద్రా
  • Share this:
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి ఆనంద్ మహీంద్ర విరమణ తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపులో మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో సంస్థను విజయపథంలో నడిపించిన ఆనంద్ మహీంద్రా సెబీ మార్గదర్శకాల నేపథ్యంలో మహీంద్రా గ్రూపు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బోర్డు ఆమోదం తెలిపిందందని ఎం అండ్‌ ఎండ్‌ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పవన్ కుమార్ గోయెంకా, కొత్త సీఈవోగా ఒక సంవత్సరం పాటు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.

అయితే మహీంద్రా సంస్థకు పవన్ గోయెంకా ఎండీగా నియమితులవుతున్నారు. ఆయన సీఈవోగా అదనపు బాధ్యతలు వ్యవహరిస్తారు. ఉన్నతస్థాయి నాయకత్వంలో మార్పు కోసం మహీంద్రా గ్రూపు నామినేషన్ కమిటీ ఏర్పాటు చేసి ఏడాది పాటు కసరత్తు చేసినట్లు సమాచారం. కాగా ఆనంద్ మహీంద్రా ఇకపై నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కంపెనీకి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తారని మహీంద్రా గ్రూపు ఓ ప్రకటనలో పేర్కొంది.
Published by: Krishna Adithya
First published: December 20, 2019, 5:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading