Home /News /business /

ANAND MAHINDRA REPLY GOES VIRAL AFTER A MAN WHO BOUGHT MAHINDRA XUV 700 WITH HIS 10 YEARS EARNINGS BA GH

పదేళ్లు కష్టపడి మీ కంపెనీ కారే కొన్నా సార్.. ఆనంద్ మహీంద్రా ఆశీర్వాదం కోరిన వ్యక్తి.. ఆయన ఇచ్చిన ఒక్క రిప్లైతో అలా..

ఆనంద్ మహీంద్రా ఆశీర్వాదం కోసం ట్వీట్ చేసిన వ్యక్తి (Image;@itsakdmk/Twitter)

ఆనంద్ మహీంద్రా ఆశీర్వాదం కోసం ట్వీట్ చేసిన వ్యక్తి (Image;@itsakdmk/Twitter)

అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తి మాత్రం తాను కొన్న కారు కంపెనీకి ఓనర్‌ అయిన ఆనంద్ మహీంద్రా నుంచి బ్లెస్సింగ్స్ కోరారు. "10 సంవత్సరాలు కష్టపడి కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (XUV700) కొన్నాను. మీ ఆశీర్వాదం కావాలి సర్" అని ట్వీట్ చేస్తూ మహీంద్రాను ట్యాగ్ చేశారు.

ఇంకా చదవండి ...
దేశీయ వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ ఛైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో దాగున్న క్రియేటివ్ వీడియోలను తన ఫాలోవర్స్‌కు పరిచయం చేస్తూ ఫిదా చేస్తుంటారు. దేశంలో జరుగుతున్న వివిధ విషయాలపై స్పందిస్తారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తారు. సోషల్ మీడియా ద్వారా సామాన్యులతో ముచ్చటిస్తారు. అయితే తాజాగా ఒక మహీంద్రా కంపెనీ కస్టమర్ (Customer) తనకు బ్లెస్సింగ్స్ (Blessings) ఇవ్వాలని ఆనంద్ మహీంద్రాను ట్విట్టర్ వేదికగా కోరారు. దీంతో మహీంద్రా ఆసక్తికర రిప్లై ఇచ్చారు. ఆ కస్టమర్‌ ట్వీట్‌కు అతను స్పందించిన తీరు ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేస్తోంది.

కారు కొనాలనే కోరిక చాలామందికి ఉంటుంది. పేద, మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వారు కారు కొనాలంటే చాలా కష్టపడి డబ్బులు సంపాదించాల్సి ఉంటుంది. సరిపడా డబ్బులు సంపాదించి కారు కొనుగోలు చేస్తే వచ్చే ఆనందం వేరు. ఇదొక ఎమోషనల్ మూమెంట్‌గా కూడా వారి జీవితాల్లో నిలిచిపోతుంది. కారు కొనుగోలు చేసిన తర్వాత తల్లిదండ్రులను ఆశీర్వాదాలు అడగటం చాలా సహజంగా జరుగుతుంది. అయితే అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తి మాత్రం తాను కొన్న కారు కంపెనీకి ఓనర్‌ అయిన ఆనంద్ మహీంద్రా నుంచి బ్లెస్సింగ్స్ కోరారు. "10 సంవత్సరాలు కష్టపడి కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (XUV700) కొన్నాను. మీ ఆశీర్వాదం కావాలి సర్" అని ట్వీట్ చేస్తూ మహీంద్రాను ట్యాగ్ చేశారు.


Maruti Suzuki Alto: 4 లక్షలకే మారుతీ సుజుకీ ఆల్టో వచ్చేస్తోంది... ప్రత్యేకతలివే



అశోక్‌కుమార్ తన ట్వీట్‌లో ఒక ఫొటో కూడా షేర్ చేసుకున్నారు. అతను తన సరికొత్త వైట్ కలర్ XUV, పక్కన నిలబడి ఉన్న తన ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. కొంత సమయం తర్వాత ఈ పోస్ట్‌పై మహీంద్రా స్పందించారు. మహీంద్రా రిప్లై ఇస్తూ "థాంక్యూ, కానీ మా కారును ఎంచుకొని మమ్మల్ని ఆశీర్వదించినది మీరే. కష్టపడి పని చేయడం ద్వారా వచ్చిన మీ విజయానికి అభినందనలు. హ్యాపీ మోటరింగ్" అని అన్నారు. ఈ ట్వీట్‌కు అశోక్‌కుమార్ సంతోషించారు. అనంతరం 'థాంక్యూ సో మచ్ సార్' అని చెప్పారు. తన కంపెనీ కారును ఎంపిక చేసుకొని మీరే మమ్మల్ని ఆశీర్వదించారు అని అశోక్‌ కుమార్‌కి కృతజ్ఞతలు చెప్పిన ఆనంద్ మహీంద్రా తీరుని చాలామంది పొగుడుతున్నారు. 

ఈ ట్వీట్‌ రిప్లైకి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. "గొప్పగా స్పందించారు సర్. మీ కృతజ్ఞతలు చాలామందికి సంతోషం కలిగిస్తాయి. ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అశోక్‌కుమార్‌కు అభినందనలు. కష్టానికి తగిన ఫలితం ఎప్పుడూ దక్కుతుంది" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మీరు చాలా సింపుల్ గా ఉంటారు సార్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ స్వభావం నాకు బాగా నచ్చుతుంది అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. "ఈ ట్వీట్ చదువుతుంటే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి" అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Anand mahindra, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు