మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్ర... ప్లాస్టిక్ బాటిళ్లకు గుడ్ బై...

కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని నిషేధించాలని డిసైడైన తర్వాత... అన్ని వర్గాల నుంచీ పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో ముందుండే ఆనంద్ మహీంద్రా ఆల్రెడీ ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 15, 2019, 10:42 AM IST
మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్ర... ప్లాస్టిక్ బాటిళ్లకు గుడ్ బై...
మెటల్ బాటిళ్లను ప్రవేశపెట్టిన ఆనంద్ మహీంద్రా (Source - Twitter - anand mahindra)
  • Share this:
మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఆనంద్ మహీంద్రా తాజాగా పెట్టిన ట్విట్టర్ పోస్టుకి నెటిజన్లు, అభిమానుల నుంచీ ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంతకీ ఆ పోస్టులో ఆయన ఏం చెప్పారంటే... ఇకపై తన ఆఫీసుల్లో మీటింగ్‌లు, బోర్డ్‌రూంలలో తాగేందుకు వాడే ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో... రీ-యూజబుల్ బాటిళ్లను ప్రవేశపెడుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అందుకు సంబంధించి ఓ ఫొటో కూడా పెట్టారు. అందులో రాగి, వెండి ఇతర లోహాల బాటిళ్లు ఉన్నాయి. వాటిపై మహీంద్రా రైజ్ అనే మార్క్ కూడా ఉంది. సెప్టెంబర్ 13 నుంచీ ఈ మెటల్ బాటిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు ఆనంద్ మహీంద్రా. ఆయన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. మెటల్ బాటిళ్లతో నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అని చెబుతున్నారు.


నిజానికి ఆనంద్ మహీంద్రా... జులైలో... తన ఆఫీస్ బోర్డ్‌రూమ్స్‌లో ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో మెటల్ బాటిళ్లను ప్రవేశపెడతానని ప్రకటించారు. ఇందుకు కారణం... ఆయన పెట్టిన ఓ ట్వీట్‌లో ఆఫీస్ బోర్డ్‌రూంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు... ప్లాస్టిక్ బాటిళ్లు కనిపించాయి. వాటిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని నిషేధించవచ్చు కదా అని నెటిజన్లు కోరారు. సరేనన్న ఆనంద్ మహీంద్రా... మాట నిలబెట్టుకున్నారు.
మహీంద్రా తాజాగా పెట్టిన పోస్టుకి ఇప్పటికే 33వేల లైక్స్ వచ్చాయి. 1100 మంది కామెంట్స్ చేశారు. ఇటీవలే మహీంద్రా... కోయంబత్తూర్‌లో... రూపాయికే ఒక ఇడ్లీని అమ్ముతున్న ముసలామె హోటల్‌లో పెట్టుబడి పెడతానని ప్రకటించి... అందరి మనసులూ గెలుచుకున్నారు. అక్టోబర్ 2 నుంచీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని నిషేధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు