హోమ్ /వార్తలు /బిజినెస్ /

Current Challenges: భారత్‌కు వ్యతిరేకంగా ఎప్పుడూ పందెం వేయకండి.. గ్లోబల్ మీడియాకు ఆనంద్ మహీంద్రా కౌంటర్

Current Challenges: భారత్‌కు వ్యతిరేకంగా ఎప్పుడూ పందెం వేయకండి.. గ్లోబల్ మీడియాకు ఆనంద్ మహీంద్రా కౌంటర్

ఆనంద్ మహీంద్రా(ఫైల్ ఫొటో)

ఆనంద్ మహీంద్రా(ఫైల్ ఫొటో)

Current Challenges: దాదాపు 60 శాతం దేశాలు ఆర్థిక మాంద్యం ప్రభావానికి గురవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో భారత్ కూడా ఉందని పలు రిపోర్ట్స్ వెల్లడించడంతో ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా కంపెనీ యజమాని ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం హెచ్చరికల నేపథ్యంలో బడా కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దాదాపు 60 శాతం దేశాలు ఆర్థిక మాంద్యం ప్రభావానికి గురవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో భారత్ (India) కూడా ఉందని పలు రిపోర్ట్స్ వెల్లడించడంతో ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా కంపెనీ యజమాని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాపార రంగంలో ప్రస్తుత సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ క్షేమంగా బయటపడి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగగలదని ధీమా వ్యక్తం చేశారు. భూకంపాలు, కరువులు, ఉగ్రదాడులు వంటి ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని భారత్ నిలిచిందన్నారు.

* భారత్‌కు వ్యతిరేకంగా పందెం కాయవద్దు

ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న భారత్‌ ఆశయాన్ని ఆర్థిక మాంద్యం సవాళ్లు దెబ్బతీస్తాయా? అనే కోణంనలో గ్లోబల్ మీడియా ఊహాగానాల నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘వ్యాపార రంగంలో ప్రస్తుత సవాళ్లు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలనే భారత్ ఆశయాలను దెబ్బతీస్తాయా అని గ్లోబల్ మీడియా ఊహిస్తోంది. మేం భూకంపాలు, కరవు, మాంద్యం, యుద్ధాలు, తీవ్రవాద దాడులను ఎదుర్కొంటూనే జీవిస్తున్నాం. నేను చెప్పేది ఒక్కటే భారత్‌కు వ్యతిరేకంగా ఇప్పుడు, ఎప్పుడూ పందెం కాయవద్దు’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

* ఎంఎస్‌ఎంఈ కోసం ఎంటర్‌ప్రైజ్‌భారత్

మహీంద్రా కంపెనీ యాజమాని ఆనంద్ మహీంద్రా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల(MSME)ల అభివృద్ధికి అవసరమైన పెట్టుబడి, నిధుల కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రూ.10 కోట్ల కార్పస్ ఫండ్‌‌తో #EnterpRISEBharat అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా అర్హత ఉన్న మైక్రో ఎంటర్ ప్రైజెస్‌ సంస్థల్లో రూ.25 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టనున్నట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.

ఇది కూడా చదవండి : కర్ణాటకలో హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించిన ప్రధాని మోదీ

* #EnterpRISEBharatలో పాల్గొనడానికి స్టెప్స్ ఇలా..

EnterpRISEBharat అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు ప్రతిస్పందనగా ట్విట్టర్‌లో బిజినెస్ స్టోరీ షేర్ చేయడం ద్వారా దేశంలోని చిన్న వ్యాపారాలను నామినేట్ చేయాలి. ఎంట్రీ తప్పనిసరిగా ట్వీట్ రూపంలో ఉండాలి. ఇమేజ్ లేదా వీడియో ద్వారా అందుకు సపోర్ట్ తీసుకోవచ్చు. బిజినెస్ ప్రత్యేకత, ఇతర వాటి కంటే ఎలా భిన్నమైందో వివరించాలి. అధికారిక అప్‌డేట్స్ కోసం @ERISEBharatను ఫాలో కావాలి.

* తుది ఎంట్రీలకు రూ.25 లక్షల గ్రాంట్

షార్ట్‌లిస్ట్ అయిన వారికి, వారి వ్యాపారానికి సంబంధించిన వివరాలను తెలపాలని కోరుతూ @ERISEBharat నుంచి డైరెక్ట్ మెసేజ్ వస్తుంది. షార్ట్‌లిస్ట్ చేసిన ఎంట్రీలు వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తుది ఎంట్రీలలో ఒక్కోదానికి రూ.25 లక్షల వరకు గ్రాంట్ లేదా పెట్టుబడిని అందించే అవకాశం ఉంది.

First published:

Tags: Anand mahindra, India, National News

ఉత్తమ కథలు