పుట్టిన రోజుకు కారు గిఫ్ట్ అడిగిన ఫ్యాన్... ఆనంద్ మహీంద్రా ఆన్సర్ ఇదీ...

సెలబ్రిటీలకు బలం ఫ్యాన్సే... ఒక్కోసారి ఆ ఫ్యాన్సే... షాక్ ఇస్తూ ఉంటారు. అలాంటి ఓ సందర్భాన్ని ఆనంద్ మహీంద్రా ఎలా ఫేస్ చేశారో చూడండి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 17, 2019, 11:26 AM IST
పుట్టిన రోజుకు కారు గిఫ్ట్ అడిగిన ఫ్యాన్... ఆనంద్ మహీంద్రా ఆన్సర్ ఇదీ...
ఆనంద్ మహీంద్రా (File)
  • Share this:
"సార్... నేను మీకు బిగ్ ఫ్యాన్‌ని. కాబట్టి... నా పుట్టిన రోజు నాడు నాకు మహీంద్రా థార్ కారును గిఫ్టుగా ఇవ్వగలరా?" అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమొబైల్ కంపెనీ చీఫ్ ఆనంద్ మహీంద్రాను ట్విట్టర్‌లో అడిగాడు విపుల్ అనే అభిమాని. జనరల్‌గా ఇలాంటి కొంటె ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తుంటారు సెలబ్రిటీలు. కానీ సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా... ఆ అభిమానికి తనదైన స్టైల్‌లో ఆన్సర్ ఇచ్చారు. ముందుగా ఆయన... CHUTZPAH అనే పదాన్ని పరిచయం చేశారు. దాని అర్థం అతి ఆత్మ విశ్వాసం అని వివరించారు. ఇతర నెటిజన్లతో... "మీరు విపుల్‌ని ప్రేమించండి లేదా ద్వేషించండి కానీ... అతని అతి విశ్వాసాన్ని మెచ్చుకోవాల్సిందే" అని నెటిజన్లకు వివరణ ఇస్తూ... అప్పుడు విపుల్‌కి సమాధానం ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. "నీ అతి విశ్వాసానికి ఫుల్ మార్కులు వేస్తున్నా... కానీ దురదృష్టవశాత్తూ నేను నీకు ఎస్ చెప్పలేను. నా దుకాణం మూసుకోవాల్సి వస్తుంది"... అని కర్ర విరగకుండా పాము చచ్చే ఆన్సర్ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా.


ఆనంద్ మహీంద్రా ఇలా నెటిజన్లతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. చాలా సందర్భాల్లో సామాజిక అంశాలపై ఆయన ప్రశ్నిస్తారు. ఇదివరకు ఉన్నావో రేప్ ఘటనపై మిగతా పారిశ్రామిక వేత్తల కంటే ముందుగా ఆనంద్ మహీంద్రాయే స్పందించారు. అందుకే సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు.
First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>