Murali Krishna, News18, Kurnool
వ్యవసాయ రంగంలో (Agriculture) రైతులు అనేక మార్గాలను ఉంచుకొని పంటలు సాగు చేస్తుంటారు. అందులో ముఖ్యంగా సీవీర్, పాలేకర్ వంటి వాళ్లు చెప్పే పద్ధతులు ఎక్కువగా పాటిస్తుంటారు. పైగా దేశంలో ఎక్కడ చూసినా ఇప్పడదే ఫేమస్ అయింది. చాలా మంది ఆదర్శ రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ లాభాలు గడిస్తున్నారు. నిన్నటి వరకు నష్టాలు చూసిన వారు.. ఇప్పుడు రెట్టింపు లాభాలు ఆర్జిస్తున్నారు. ఐతే కొందరు రైతులు మాత్రం మరింత వినూత్నంగా వ్యవసాయం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అందరికంటే భిన్నంగా కర్నూలు జిల్లా (Kurnool District) ఓర్వకల్ మండలంలో బైరాపురం గ్రామంలో వై.కిరణ్ కుమార్ వ్యవసాయం చేస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఎం.టెక్ పూర్తి చేసిన కిరణ్ కుమార్ వ్యవసాయంపై మక్కువతో గత 5 సంవత్సరాలుగా కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం బైరాపురం గ్రామంలో సిద్ధ వ్యవసాయం చేస్తున్నారు.
తొలుత పక్కనున్న రైతులంతా పిచ్చివాడిగా చూసినవారే…కానీ ఇప్పుడు వాళ్లే ముక్కున వేలేసుకుంటున్నారు. మొదట ఎండుకొర్రలు, మినుములు, వంటి వాటిని సాగుచేసిన కిరణ్ ...గత మూడు సంవత్సరాలుగా ఇతర రైతులకు ఏ మాత్రం తీసిపోకుండా దిగుబడి రాబడుతున్నాడు. మిగితా రైతులు చీడ పురుగుల నివారకై వాడే ఫెర్టెలైజర్స్ వంటివి వాడకుండా కేవలం సహజ సిద్దమైన హోమ బస్మంనే వాడటం అతను చేస్తున్న పద్ధతి.
మాములు వ్యవసాయంలో పంటలకు లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం వందలలో అతి తక్కువ పెట్టుబడితో పంటలు సాగుచేయొచ్చని అంటున్నారు. ఈ సిద్ద పద్దతిలో వ్యవసాయం చేయడం వలన విషరహిత పంటను పండించుకోవడమే కాకుండా పంటలకు చీడపురుగుల నివారణకు వాడే ఫర్టిలైజర్స్ ద్వారా ప్రమాదాలకు అవకాశం ఉండదు అంటున్నారు.
అందులోనూ ఈ పద్ధతి ద్వారా పండించిన నాణ్యమైన, విష రహిత ఆహారన్ని ప్రజలకు అందించవచ్చంటున్నాడు. అంతే కాకుండా ఈ పద్ధతి ద్వారా పండించిన పంటలకు మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటుంది అని అందరూ ఇలాంటి పద్ధతులు పాటించి పంటలు సాగుచేయడం ద్వారా భూమి సారవంతంగా తయారై మొక్కకు కావాల్సిన బలాన్ని అందిస్తుంది అంటున్నారు.
తనకున్న రెండెకరాల్లో సోయబీన్ పండిస్తున్న కిరణ్.., వర్షఆధారంగానే దీనిని సాగు తీస్తున్నారు. పంట చేతికి వచ్చేసరికి రూ.55,000 పెట్టుబడి పెడుతున్నారు. ఇందులో కలుపు తీయడానికే రూ.15వేల వరకు ఖర్చవుతుంది. ఎకరాకు 7-9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్ రూ.10,000వేలకు విక్రయించినా దాదాపు మూడింతల లాభం వస్తుందని కిరణ్ చెబుతున్నారు.
ఈ పద్ధతుల్లో పంటలు సాగు చేయాలనుకున్న రైతులకు సిద్ద వ్యవసాయంపై అవగాహన కల్పించి ఏ సమయంలో ఎలాంటి పంటలు వేసుకోవాలి అనేదానిపై శిక్షణ ఇస్తాను అని చెబుతున్నారు కిరణ్కుమార్. ఫోన్ నెంబర్: 89199 58674, వై. కిరణ్ కుమార్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Farmer, Kurnool, Local News