• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • AMPERE SLASHES ELECTRIC SCOOTER PRICES BY UP TO RS 9000 ACCORDING TO REVISED FAME II SUBSIDY GH SK

Ampere E-Scooter: బంపర్ ఆఫర్.. సబ్సిడీ రెట్టింపు.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.9వేల డిస్కౌంట్

ప్రతీకాత్మక చిత్రం

Ampere e Scooters: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్ బంపరాఫర్ ప్రకటించింది. తన అన్ని ఈ–స్కూటర్ మోడళ్లపై రూ. 9 వేల వరకు డిస్కౌంట్ అందిస్తామని తెలిపింది.

  • Share this:
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్ బంపరాఫర్​ ప్రకటించింది. తన అన్ని ఈ–స్కూటర్​ మోడళ్లపై రూ. 9 వేల వరకు డిస్కౌంట్​ అందిస్తామని వెల్లడించింది. దేశంలో ఎలక్ట్రిక్​ వాహన విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన FAME II స్కీమ్​లో ఇటీవల సవరణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సవరణల్లో భాగంగా తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. ఫలితంగా, అన్ని ఎలక్ట్రిక్​ వాహన తయారీ సంస్థలు వరుసగా ఈ తగ్గింపును ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆంపియర్​ సంస్థ కూడా తన ఈ–స్కూటర్ల​పై తగ్గింపును ప్రకటించింది. ఆంపియర్​ పంచుకున్న వివరాలను పరిశీలిస్తే.. ఆంపియర్​ జీల్ మోడల్ ధర గతంలో రూ .68,990 (ఎక్స్​షోరూమ్​, బెంగళూరు) వద్ద ఉండగా, దాన్ని రూ .59,990 వద్ద విక్రయించనుంది. అదేవిధంగా 'మాగ్నస్ ప్రో' మోడల్ ధరను రూ. 74,990 నుండి రూ. 65,990 లకు తగ్గించింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం 2019లో తీసుకొచ్చిన ఫేమ్ II స్కీమ్​లో సవరణ చేయడంతో వీటి ధరలు తగ్గాయి. తాజా సవరణల్లో భాగంగా ఈ–బైక్‌లు, ఈ–స్కూటర్లపై కిలోవాట్​ ఇంజిన్​కు రూ .15 వేల వరకు తగ్గుతుంది. అంటే, గతంలో కంటే వీటిపై 50 శాతం ఎక్కువ సబ్సిడీని అందిస్తుంది. తద్వారా, ఈ–వాహనాల ధరలు బారీగా తగ్గుతున్నాయి.

FAME II స్కీమ్ సవరణతో తగ్గిన ధరలు..

‘‘FAME II స్కీమ్​లో సవరణ ద్వారా ఎలక్ట్రిక్​ వెహికిల్స్​కు కేంద్రం ఇస్తున్న సబ్సిడీ రెట్టింపైంది. దీంతో, మా ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్​ మెడళ్ల ధరను తగ్గించాలని నిర్ణయించాం. ప్రతి వేరియంట్​పై దాదాపు రూ. 9 వేల వరకు డిస్కౌంట్​ లభిస్తుంది. దీంతో, ఈ–స్కూటర్​ అమ్మకాలు వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాం. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశీయ ఈ–వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం." అని ఆంపియర్ ఎలక్ట్రిక్ ఇ-మొబిలిటీ బిజినెస్ COO రాయ్ కురియన్ అన్నారు. కాగా, గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ అయిన ఆంపియర్ భారత మార్కెట్​లో వేగంగా విస్తరిస్తోంది. ఈ సంస్థ ఇప్పటివరకు 80,000 మంది కస్టమర్లకు సర్వీసులను అందించింది. ప్రస్తుతం,ఈ సంస్థ దేశంలోని 260 పట్టణాల్లో 330 అవుట్‌లెట్స్​ లేదా డీలర్​షిప్​ సెంటర్లను కలిగి ఉంది.
Published by:Shiva Kumar Addula
First published: