AMPERE MAGNUS PRO ELECTRIC SCOOTER COST OF RUNNING IS JUST 15 PAISE PER KILOMETER SAYS COMPANY SS
Electric Scooter: 15 రూపాయలకే 100 కిలోమీటర్ల ప్రయాణం... ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతం
Electric Scooter: 15 రూపాయలకే 100 కిలోమీటర్ల ప్రయాణం... ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతం
(image: Ampere)
Ampere Magnus Pro electric scooter | మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. ఈ స్కూటర్‌పై 100 కిలోమీటర్లు ప్రయాణించడానికి రూ.15 చాలని కంపెనీ చెబుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు ఎప్పుడూ షాకిస్తుంటాయి. అందుకే ఖర్చు తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గుచూపేవారు ఉంటారు. ఎలక్ట్రిక్ స్కూటర్లతో అనేక లాభాలు ఉంటాయి. ఛార్జింగ్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఆంపీర్ వెహికిల్స్ మాగ్నస్ ప్రో పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంఛ్ చేసింది. ఈ స్కూటర్‌పై కిలోమీటర్ ప్రయాణించాలంటే అయ్యే ఖర్చు కేవలం 15 పైసలు మాత్రమే. అంటే 100 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.15 విద్యుత్ ఖర్చవుతుంది. పెట్రోల్ స్కూటర్‌కు ఏడాదికి రూ.27,000 ఖర్చయితే, మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఏడాదికి రూ.2,700 ఖర్చవుతుందని, కస్టమర్ల డబ్బు ఆదా చేయడమే తమ లక్ష్యమని కంపెనీ చెబుతోంది. భారతదేశంలోని 200 పట్టణాల్లో ఉన్న ఆంపీర్ షోరూమ్స్‌లో ఈ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.73,990. ఫేమ్ 2 సబ్సిడీ మినహాయించిన తర్వాత ధర ఇది. మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మూడేళ్ల స్టాండర్డ్ వారంటీ అందిస్తోంది కంపెనీ.
The new Magnus Pro has arrived! The electric scooter that will redefine the way you rode the conventional scooter.
— Ampere Electric Vehicles (@ampere_ev) June 15, 2020
ఇక మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లో 450ఎంఎం లెగ్‌రూమ్, డిజిటల్ డ్యాష్‌బోర్డ్, స్టెప్ టైప్ సీట్, ఎల్ఈడీ లైట్, యూఎస్బీ ఛార్జర్, కీ-లెస్ ఎంట్రీ, యాంటీ థెఫ్ట్ అలారం, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫుల్ ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు డిటాచబుల్ బ్యాటరీ ఆప్షన్ కూడా ఉంది. అంటే స్కూటర్ నుంచి బ్యాటరీని విడదీసి వేరుగా ఛార్జింగ్ కూడా చేయొచ్చు. అంటే పార్కింగ్ ఏరియాలో ఛార్జింగ్ సదుపాయం లేకపోతే బ్యాటరీని తీసుకెళ్లి ఎక్కడైనా ఛార్జింగ్ చేయొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఎకో మోడ్‌లో 100 కిలోమీటర్లు, క్రూజ్ మోడ్‌లో 80 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకన్లలో అందుకోవచ్చని కంపెనీ చెబుతోంది. లింప్ టు హోమ్ మరో ఆకర్షణీయమైన ఫీచర్. బ్యాటరీ 10 శాతం ఉన్నప్పుడు 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.