Ampere Magnus EX: ఆంపియర్​ మాగ్నస్​ ఎక్స్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే! 

Ampere Magnus EX

కొత్త మాగ్నస్ ఎక్స్​ ఈ-స్కూటర్ డిటాచబుల్ లైట్ వెయిట్ & పోర్టబుల్ అడ్వాన్స్​డ్​ లిథియం బ్యాటరీతో వస్తుంది. ఇల్లు, ఆఫీస్​, కాఫీ షాప్ లేదా ప్లగ్- ఆన్ -ది -వాల్ ఛార్జ్ పాయింట్‌లోని ఏదైనా 5- ఆంప్​ సాకెట్ ద్వారా సులభంగా ఛార్జ్​ చేయవచ్చు.

  • Share this:
ఎలక్ట్రిక్​ టూవీలర్​ బ్రాండ్​ ఆంపియర్ తాజాగా మాగ్నస్ ఎక్స్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​ను లాంచ్​ చేసింది. ఈ కొత్త స్కూటర్​ను రూ. 68,999 (ఎక్స్-షోరూమ్, పూణే) ధర వద్ద ఆవిష్కరించింది. ఇది లాంగ్​ రేంజ్​, ఆకర్షనీయమైన ఫీచర్లతో విడుదలైంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 121 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త మాగ్నస్ ఎక్స్​ ఈ-స్కూటర్ డిటాచబుల్ లైట్ వెయిట్ & పోర్టబుల్ అడ్వాన్స్​డ్​ లిథియం బ్యాటరీతో వస్తుంది. ఇల్లు, ఆఫీస్​, కాఫీ షాప్ లేదా ప్లగ్- ఆన్ -ది -వాల్ ఛార్జ్ పాయింట్‌లోని ఏదైనా 5- ఆంప్​ సాకెట్ ద్వారా సులభంగా ఛార్జ్​ చేయవచ్చు. ఇందుకోసం దీనిలో డిటాచబుల్ బ్యాటరీ సెటప్​ని అందించింది.

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్‌ 1200 వాట్స్ మోటార్​తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లోని మోటార్ కేవలం 10 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకోగలదని పేర్కొంది. ఈ స్కూటర్ సూపర్ సేవర్ ఎకో మోడ్, పెపియర్ పవర్ మోడ్‌ అనే రెండు రైడింగ్ మోడ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త స్కూటర్‌లోని కొన్ని ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే.. ఎల్​ఈడీ హెడ్‌లైట్, 450 మి.మీ. లెగ్‌రూమ్ స్పేస్, కీ లెస్ ఎంట్రీ, వెహికల్ ఫైండర్, యాంటిథెఫ్ట్ అలారం వంటివి అందించింది. ఇందులోని బ్యాటరీని సులభంగా తీసివేయవచ్చు. కాబట్టి ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి డిజైన్​, లుక్​తో ఇది యూజర్లను ఆకర్షిస్తోంది. ఈ డిజైన్​ మరింత అద్భుతంగా కనిపించేలా చేయడానికి సౌకర్యవంతమైన, విశాలమైన సీటును అందించింది. రైడర్​కి ఇది మంచి రైడింగ్​ అనుభవాన్ని అందిస్తుంది.

ఓలా ఎస్​1 స్కూటర్​కి గట్టి పోటీ..

ఆంపియర్​ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మెటాలిక్ రెడ్, గ్రాఫైట్ బ్లాక్ & గెలాక్సీ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని లాంచింగ్​ గురించి ఆంపియర్ ఎలక్ట్రిక్ COO, రాయ్ కురియన్ మాట్లాడుతూ "దేశంలో రోజు రోజుకీ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో, వాహనదారులు ఎలక్ట్రికల్​ వెహికల్స్​ వైపు మొగ్గుచూపుతున్నారు. వారి కోసం సరికొత్త మాగ్నస్ ఎక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను లాంచ్​ చేశాం. దేశీయ మార్కెట్​లో దీనికి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాం.”అని అన్నారు. కాగా, ఈ మాగ్నస్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఓలా ఎస్​ 1కి గట్టి పోటీ ఇవ్వనుంది.
Published by:Krishna Adithya
First published: