Ampere E-Scooters: బంపర్ ఆఫర్.. రూ. 48 వేలకే ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎక్కడంటే...

ప్రతీకాత్మక చిత్రం

పెట్రోల్​ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు కాస్త ప్రియంగానే ఉన్నాయి. అందువల్ల, వీటిని కొనుగోలు చేసేందకు కస్టమర్లకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో పాటు కొన్ని రాష్ట్రాలు అదనపు రాయితీలను ప్రకటిస్తున్నాయి.

  • Share this:
ఒకవైపు పెట్రోల్​, డీజిల్​ ధరల భగభగలు.. మరోవైపు పర్యావరణ కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. కస్టమర్లను ఎలక్ట్రిక్​ వాహనాలకు దగ్గర చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫాస్టర్​ అడాప్షన్​ అండ్​ మాన్యుఫాక్చరింగ్​ ఆఫ్​ ఎలక్ట్రిక్​ వెహికల్స్​ (ఫేమ్​–2) కింద ఇస్తోన్న సబ్సిడీని రెట్టింపు చేసింది. ఫలితంగా, అన్ని ఎలక్ట్రిక్​ వాహన తయారీ సంస్థలు వరుసగా భారీ డిస్కౌంట్లను​ ప్రకటిస్తున్నాయి. ఈ–వాహనాలపై కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు కూడా అదనపు రాయితీలను అందిస్తున్నాయి. తాజాగా గుజరాత్​ రాష్ట్రం నూతన ఈవీ పాలసీ ప్రవేశపెట్టింది. ఫలితంగా గుజరాత్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఆంపియర్ నుంచి విడుదలైన రెండు ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లు రూ. 20,000 డిస్కౌంట్​తో అందుబాటులో ఉన్నాయి.

గతంలో ఆంపియర్​ మాగ్నస్ మోడల్​ 74,990 వద్ద లభించేంది. కానీ, ఇప్పుడు అదే మోడల్​ గుజరాత్‌ రాష్ట్రంలో కేవలం రూ. 47,990 ధర వద్ద లభిస్తుంది. అదేవిధంగా, జీల్​ మోడల్​ గతంలో రూ. 9 68,990 ధర వద్ద లభించేంది. కానీ ఇప్పుడు అదే మోడల్​ను​ రూ. 41,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనిపై ఆంపియర్ ఎలక్ట్రిక్ రాయ్ కురియన్ మాట్లాడుతూ “ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించేందుకు గుజరాత్​ ప్రభుత్వం నూతన ఈవీ పాలసీ ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు. ఈ పాలసీతో సబ్సిడీ పెరిగి తక్కువ ధర వద్దే వినియోగదారులకు ఈ– స్కూటర్లను విక్రయించగలుగుతున్నాం.” అని అన్నారు. ఈ ఎలక్ట్రిక్​ వాహనాలతో పెట్రోల్ ఖర్చులు గణనీయంగా తగ్గించవడమే కాకుండా రవాణా ఖర్చులను గణనీయంగా ఆదా చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

నూతన ఈవీ పాలసీతో రెట్టింపైన సబ్సిడీ..
పెట్రోల్​ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు కాస్త ప్రియంగానే ఉన్నాయి. అందువల్ల, వీటిని కొనుగోలు చేసేందకు కస్టమర్లకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో పాటు కొన్ని రాష్ట్రాలు అదనపు రాయితీలను ప్రకటిస్తున్నాయి. ఉదాహరణకు గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ వంటి రాష్ట్రాలు తక్కువ ధరకే ఈ–వాహనాలను అందించాలనే లక్ష్యంతో ఈవీ పాలసీని రూపొందించాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్​ వాహన తయారీ పరిశ్రమకు కావాల్సిన అన్ని సహాయక మౌలిక సదుపాయాలను విస్తరించే ప్రణాళికలను రూపొందిస్తున్నాయి.

గుజరాత్ రాష్ట్రం తాజాగా రూపొందించిన ఈవీ పాలసీ ప్రకారం, ఎలక్ట్రిక్ ఈ–స్కూటర్లపై రూ. 20,000, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలపై రూ. 1.5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తోంది. గుజరాత్‌ను ఈవీ తయారీ కేంద్రంగా మార్చాలని, 250 కొత్త ఛార్జింగ్ స్టేషన్లను ఇక్కడ ఏర్పాటు చేయాలని సీఎం విజయ్ రూపానీ యోచిస్తున్నారు. ఇందుకోసం ఈవీ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను సులభతం చేశారు.
Published by:Shiva Kumar Addula
First published: