Electric Scooter Offers | కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. భారీ డిస్కౌంట్ ఆఫర్ (Offer) ఒకటి అందుబాటులో ఉంది. తగ్గింపుతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్లు అన్నీ కూడా పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటాయని గుర్తించుకోవాలి. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై (EV) ఏ ఏ ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్టప్ యాంపియర్ ఈవీ కస్టమర్ల కోసం సూపర్ ఆఫర్లు తీసుకువచ్చింది. తన మోడళ్లపై కళ్లుచెదిరే డీల్స్ అందిస్తోంది. కంపెనీ ప్రిమస్, జీల్, మ్యాగ్నస్ అనే మూడు రకాల ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అందిస్తోంది. ఇందులో జీల్, మ్యాగ్నస్ అనే మోడళ్లపై తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి.
రైతులకు బ్యాంక్ శుభవార్త.. నిమిషాల్లో రూ.లక్షా 60 వేల లోన్, ఇంట్లో నుంచే పొందండిలా!
మ్యాగ్నస్ మోడల్ ఒక్కసారి ఫుల్‌గా చార్జింగ్ పెడితే 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. 10 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రివర్స్ మోడ్, హబ్ మోటార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్‌ను మీరు కేవలం రూ. 499తో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 81 వేలు. అయితే దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 40 వేలు, స్పెషల్ ఆఫర్ రూ. 6000 ఉంది. అంటే మీరు రూ. 35,900కే ఈ స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు.
ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ అదిరిపోయే శుభవార్త?
అలాగే జీల్ మోడల్ కూడా ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ. 75 వేలు. అయితే దీనిపై రూ. 4 వేల డిస్కౌంట్ ఉంది. అంటే రూ. 71 వేలకు పొందొచ్చు. అలాగే కంపెనీ తన మోడళ్లపై 100 శాతం ఫైనాన్స్ సదుపాయం అందిస్తోంది. లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 8.99 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ 120 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చార్జింగ్ టైమ్ 5 గంటలు. టాప్ స్పీడ్ గంటకు 55 కిలో మీటర్లు. అందువల్ల కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. అందుబాటు ధరలోనే అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ పొందొచ్చు. మరో వైపు ఓలా కంపెనీ కూడా తన మోడళ్లపై సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E scootor, Electric Scooter, Electric Vehicle, Ev scooters, SCOOTER