Horror Movies: హర్రర్ సినిమాలు చూడండి, రూ.95,000 గెల్చుకోండి.. బంపర్ ఆఫర్ ప్రకటించిన అమెరికా కంపెనీ

ప్రతీకాత్మకచిత్రం

మీకు హర్రర్ సినిమాలంటే ఇష్టమా? అయితే ఈ ఇష్టాన్ని డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగించుకోవచ్చని చెబుతోంది ఒక అమెరికన్ కంపెనీ. అక్టోబర్‌లో 13 హర్రర్ సినిమాలు చూసి, వాటికి ఫీడ్‌బ్యాక్ ఇస్తే.. సుమారు 1,300 డాలర్లు లేదా రూ.95,000 చెల్లిస్తామని ఫైనాన్స్‌బజ్ అనే కంపెనీ వెల్లడించింది.

  • Share this:
మీకు హర్రర్ సినిమాలంటే ఇష్టమా? అయితే ఈ ఇష్టాన్ని డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగించుకోవచ్చని చెబుతోంది ఒక అమెరికన్ కంపెనీ. అక్టోబర్‌లో 13 హర్రర్ సినిమాలు చూసి, వాటికి ఫీడ్‌బ్యాక్ ఇస్తే.. సుమారు 1,300 డాలర్లు లేదా రూ.95,000 చెల్లిస్తామని ఫైనాన్స్‌బజ్ అనే కంపెనీ వెల్లడించింది. ఈ సంస్థ 'హర్రర్ మూవీ హార్ట్ రేట్ ఎనలిస్ట్' పోస్టుకు ఒక వ్యక్తిని నియమించుకోవాలని చూస్తోంది. ఎంపికైన వారు 13 భయంకరమైన సినిమాలు చూడాల్సి ఉంటుంది. వారి హృదయ స్పందన రేటును ఫిట్‌నెస్ ట్రాకర్ సాయంతో గుర్తిస్తామని కంపెనీ ప్రకటించింది. సినిమా బడ్జెట్ అవుట్‌పుట్‌ను, హర్రర్ స్థాయిని ప్రభావితం చేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నామని ఫైనాన్స్‌బజ్ కంపెనీ వెల్లడించింది.

‘ఈ ఉద్యోగం ద్వారా అధిక బడ్జెట్ హర్రర్ సినిమాలు.. తక్కువ బడ్జెట్ సినిమాల కంటే ఎక్కువ భయాన్ని కలుగజేస్తాయో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ 13 సినిమాలు చూస్తున్నప్పుడు, హృదయ స్పందన రేటును పర్యవేక్షించడానికి ఫిట్‌బిట్ ధరించాల్సి ఉంటుంది. దీని ద్వారా సినిమా ఎంత భయంకరంగా ఉంటుందో గుర్తిస్తాం. ఇలా సినిమా బడ్జెట్‌ హర్రర్ లెవల్స్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటాం’ అని ఫైనాన్స్‌బజ్ సంస్థ పేర్కొంది.

ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి చూడాల్సిన సినిమాలు ఏవి?
ఫైనాన్స్‌బజ్‌ ఉద్యోగానికి ఎంపికైన వారు.. సా, అమిటీవిల్లే హర్రర్, ఎ క్వైట్ ప్లేస్, ఎ క్వైట్ ప్లేస్ 2, క్యాండీమాన్, ఇన్‌సైడియస్, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్, సినిస్టర్, గెట్ అవుట్, ది పర్జ్, హాలోవీన్ (2018), పారానార్మల్ యాక్టివిటీ, అన్నాబెల్లె... వంటి 13 సినిమాలు చూడాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు.. ఖర్చుల కోసం 50 డాలర్ల గిఫ్ట్ కార్డు వంటి అదనపు ప్రోత్సాహాకాలు కూడా పొందుతారు.

ఉద్యోగానికి దరఖాస్తులు 2021 సెప్టెంబర్ 26 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. అక్టోబర్ 1 లోపు అభ్యర్ధిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వ్యక్తికి అక్టోబర్ 4 నాటికి ఫిట్‌బిట్‌ పంపుతారు. అనంతరం ఆ వ్యక్తి అక్టోబర్ 9 నుంచి 18 వరకు సినిమాలు చూసి, అసైన్‌మెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు అమెరికాలో ఉండాలి. కనీసం 18 సంవత్సరాల వయసు ఉన్నవారు ఉద్యోగానికి అర్హులు.

అమెరికాలో ఇలాంటి వింత జాబ్ ఆఫర్లు కొత్తేంకాదు. ఈ సంవత్సరం జనవరిలో మరో అమెరికన్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌ చూస్తూ, పిజ్జా తిన్న వారికి 500 డాలర్లు అందిస్తామని తెలిపింది. నెట్‌ఫ్లిక్స్‌లో కంటెంట్ చూస్తూ ఫీడ్‌బ్యాక్ అందించే “ప్రొఫెషనల్ బింజ్ వాచర్” కోసం ఈ ఆఫర్ ఇచ్చింది.
Published by:Krishna Adithya
First published: