హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Offer: బంగారం కొనే వారికి బంపరాఫర్.. రూ.10,000 భారీ డిస్కౌంట్!

Gold Offer: బంగారం కొనే వారికి బంపరాఫర్.. రూ.10,000 భారీ డిస్కౌంట్!

 బంగారం కొంటే రూ.10,000 డిస్కౌంట్! 2 రోజులే ఈ భారీ తగ్గింపు ఆఫర్..

బంగారం కొంటే రూ.10,000 డిస్కౌంట్! 2 రోజులే ఈ భారీ తగ్గింపు ఆఫర్..

Gold Price Today | బంగారం కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకని అనుకుంటున్నారా? ఏకంగా రూ. 10 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Gold Jewellery | దసరా పండుగ వచ్చేసింది. మీరు బంగారం కొనుగుల చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకని అనుకుంటున్నారా? బంగారం (Gold) కొనుగోలుపై భారీ తగ్గింపు ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఏకంగా రూ.10 వేల వరకు డిస్కౌంట్ (Gold Offer) సొంతం చేసుకోవచ్చు. ఇది పరిమిత కాల ఆఫర్. కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు వాడే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాకుండా ప్రముఖ జువెలరీ సంస్థ తనిష్క్‌లో షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ తగ్గింపు ఆఫర్ లభిస్తుంది. ఇంకా ఎంపిక చేసిన స్టోర్లలోనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని గుర్తించుకోవాలి. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

  బంగారం ధర రూ.1,800 పతనం.. రూ.2,800 పడిపోయిన వెండి

  రూ.10 వేల తగ్గింపు పొందాలని భావించే వారు ఒక విషయం తెలుసుకోవాలి. మినిమమ్ కార్డ్ ట్రాన్సాక్షన్ వాల్యూ రూ. 1,50,000గా ఉండాలి. అప్పుడే ఈ ఆఫర్ లభిస్తుంది. మీరు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటే.. దగ్గరిలోని తనిష్క్ జువెలరీ షాపుకు వెళ్లి ఆఫర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

  ఇది మామూలు వాయింపు కాదు భయ్యా.. ఏకంగా రూ.170 పెరిగిన సిలిండర్ ధర.. ఏడాదిలో 5 సార్లు పెంపు

  కాగా బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. హాల్ మార్కింగ్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం ఉత్తమం. దాదాపు ప్రతి షాపులో ధరలు ఒకేలా ఉండొచ్చు. అయితే తయారీ చార్జీలు వంటివి మారుతూ ఉంటాయి. అందువల్ల తయారీ చార్జీలు తెలుసుకోండి. ఇంకా పాత బంగారం ఇచ్చి కొత్తది కొనాలని భావిస్తే మాత్రం తరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

  ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ.50,730 వద్ద ఉంది. పది గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌కు ఈ రేటు వర్తిస్తుంది. అదే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ అయితే రూ.46,500 వద్ద ఉంది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. కాగా ఈ రేట్లకు జీఎస్‌టీ , తయారీ చార్జీలు, జువెలర్స్ ప్రాఫిట్ మార్జిన్ వంటివి అదనం అని గుర్తించుకోవాలి. అందుకే పసిడి రేట్లలో వ్యత్యాసం ఉండొచ్చు. కాగా బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. రూపాయి, డాలర్ నుంచి భౌగోళిక ఉద్రిక్తతల వరకు పసిడిపై చాలా అంశాల ప్రభావం ఉంటుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Gold, Gold jewellery, Gold ornmanets, Gold Price Today, Gold Rate Today, Latest offers

  ఉత్తమ కథలు