Gold Offers | బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి తీపికబురు. గోల్డ్ జువెలరీపై (Gold Jewellery) అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే డైమండ్ జువెలరీపై కూడా కళ్లుచెదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్లు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. కేవలం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు (Credit Card) వాడే వారికి మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది.
అంటే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా బంగారు నగలు లేదా డైమండ్ జువెలరీ కొనుగోలు చేస్తే.. అప్పుడు వారికి తగ్గింపు లభిస్తుంది. కల్యాణ్ జువెలర్స్, జోయాలుక్కాస్, క్రిష్ణయ్య శెట్టి, లెజెండ్, ట్రైబ్, మెలోర్రా వంటి వాటి ద్వారా మాత్రమే ఆభరణాలు కొనాల్సి ఉంటుంది. వీటిల్లోనే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ఆఫర్లు వర్తిస్తాయి. అలాగే వీటిల్లో కూడా ఎంపిక చేసిన స్టోర్లకే ఆఫర్లు అందుబాటులో ఉంటాయని గుర్తించుకోవాలి.
ఏడాదిలో మీ డబ్బును రెట్టింపు చేసే 5 స్టాక్స్ ఇవే!
కల్యాణ్ జువెలర్స్‌లో రూ. 75 వేలు లేదా ఆపైన విలువైన డైమండ్ జువెలరీ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 30 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే బంగారు ఆభరణాలపై అయితే తయారీ చార్జీల్లో 35 శాతం తగ్గింపు లభిస్తుంది. దీని కోసం కేజేఏఎంఈఎక్స్2020 అనే ప్రోమోకోడ్ వాడాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు లభిస్తుంది.
ఇదే సువర్ణావకాశం.. మిస్ అయితే ఇక బంగారం, వెండి కొనలేం.. ఎందుకంటే?
అలాగే జోయాలుక్కాస్‌లో అయితే రూ. 50 వేలు లేదా ఆపైన విలువైన డైమండ్ జువెలరీ కొంటే రూ. 6 వేల వరకు తగ్గింపు వస్తుంది. ఇంకా గోల్డ్ జువెలరీ తయారీ చార్జీల్లో 25 శాతం తక్షణ డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ వచ్చే ఏడాది జనవరి 25 వరకు ఉంటుంది. ఇంకా సి క్రిష్ణయ్య శెట్టి జువెలర్స్‌లో అయితే డైమండ్, గోల్డ్, సిల్వర్ జువెలరీపై గరిష్టంగా రూ. 36 వేల వరకు తగ్గింపు (రూ.4 లక్షల విలువైన డైమండ్ జువెలరీ కొనాల్సి ఉంటుంది) పొందొచ్చు. కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ. 50 వేలుగా ఉంది. ఈ ఆఫర్ డిసెంబర్ చివరి వరకు ఉంటుంది.
లెజెండ్ ఆమ్రపాలిలో అయితే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దీని కోసం లెజెండ్10 అనే ప్రోమో కోడ్ వాడాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ వచ్చే ఏడాది మే నెల చివరి వరకు ఉంటుంది. ఇంకా ట్రైబ్ ఆమ్రపాలిలో అయితే ఆన్లైన్, ఆఫ్‌లైన్ కొనుగోళ్లపై 15 శాతం తగ్గింపు ఉంది. దీనికి టీబీఏఏఎంఎక్స్15 కోడ్ ఉపయోగించాలి. ఈ ఆఫర్ కూడా వచ్చే ఏడాది మే చివరి వరకు ఉంటుంది. ఇక మెలోర్రా జువెలర్స్‌లో అయితే డైమండ్ జువెలరీపై రూ.6 వేల తగ్గింపు పొందొచ్చు. కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ. 50 వేలు. అలాగే అమెక్స్6000 ప్రోమోకోడ్ వాడాలి. గోల్డ్ జువెలరీపై అయితే రూ.4 వేల తగ్గింపు ఉంది. దీనికి అమెక్స్4000 ప్రోమోకోడ్ ఉపయోగించాలి. ఈ ఆఫర్లు వచ్చే ఏడాది మార్చి చివరి వరకు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit cards, Diamonds, Gold, Gold jewellery, Gold ornmanets