Credit Card Discount | క్రెడిట్ కార్డు వాడే వారికి తీపికబురు. అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఆన్‌లైన్ షాపింగ్ (Shopping) చేసే వారు ఏకంగా రూ. 25 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు (Credit Card) వాడే వారికి ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ నెల చివరి వరకు ఆఫర్లు లభిస్తాయని గుర్తించాలి. డిసెంబర్ 31తో ఈ ఆఫర్లు ముగుస్తాయి.
శాంసంగ్, సోనీ, ఎల్‌జీ, హయర్ వంటి పలు రకాల బ్రాండ్లపై తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ ప్రొడక్టులు కొనుగోలు చేస్తే 22.5 శాతం వరకు తగ్గింపు వస్తుంది. గరిష్టంగా రూ. 25 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు ఉంటుంది. అలాగే సోనీ ప్రొడక్టులపై ఆఫర్ ఉంది. ఈ కంపెనీ ప్రొడక్టులకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 12.5 శాతం తగ్గింపు వస్తుంది. గరిష్టంగా రూ. 22,500 వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ జనవరి 2 వరకు ఉంటుంది.
రూ.5 లక్షలలోపు ధరలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవే
అలాగే ఎల్‌జీ ప్రొడక్టులపై కూడా సూపర్ డీల్స్ పొందొచ్చు. ఈ కంపెనీ ప్రొడక్టులను కొనుగోలు చేస్తే 22.5 శాతం వరకు తగ్గింపు వస్తుంది. క్యాష్‌బ్యాక్ గరిష్టంగా రూ.20 వేల వరకు వస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక హయర్ ప్రొడక్టులపై అయితే 20 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. గరిష్టంగా రూ. 12 వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు ఉంటుంది. కేవలం ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని గుర్తించుకోవాలి. అలాగే పైన్ ల్యాబ్స్ టర్మినల్స్ ద్వారా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డును స్వైప్ చేయాల్సి ఉంటుంది.
జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.8తో 2.5 జీబీ డేటా, ఫ్రీ కాల్స్, ఉచిత ఎస్ఎంఎస్‌లు!
ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునే వారు 18 నెలల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా ఉంది. ఎంపిక చేసిన బ్రాండ్లకు ఇది వర్తిస్తుంది. అలాగే వోల్టస్, బాష్, క్యారియర్, రిలయన్స్ రిటైల్, బ్లూస్టార్, దైకిన్, డైసన్, లాయిడ్, గోద్రేజ్, క్రోమా, హిటాచీ, వర్ల్‌పూల్, టీసీఎల్, కెనాన్ వంటి ప్రొడక్టుల కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనం పొందొచ్చు. అంటే వడ్డీ భారం తగ్గింపుచుకోవచ్చ. సులభ ఈఎంఐలో ఈ ప్రొడక్టులను కొనుగోలు చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit card, Latest offers, LG, Offers, Samsung, Sony