Year End Tour Offers | ఇయర్ ఎండ్‌కు వచ్చేశాం. మీరు ఈ ఏడాది చివరిలో ఎక్కడికైనా టూర్ (Tour) ప్లాన్ చేస్తున్నారా? జాలీగా అలా ఒక వారం పది రోజులు తిరిగేసి రావాలని అనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఫ్లైట్ (Flight) టికెట్ బుకింగ్, హోటల్ బుకింగ్ వంటి వాటిపై సూపర్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు కలిగిన వారు భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. హాలిడే సీజన్‌లో ఏకంగా 25 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు వాడే వారికి గరిష్టంగా రూ. 20 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. మైక్ మై ట్రిప్ వంటి ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఏ ఏ వాటిపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉద్యోగులకు భారీ షాకిచ్చిన కేంద్రం.. కీలక ప్రకటన!
మైక్ మై ట్రిప్ ప్లాట్‌ఫామ్ ద్వారా అయితే గరిష్ట తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ బుకింగ్‌పై 15 శాతం తగ్గింపు లభిస్తోంది. గరిష్టంగా రూ.2 వేల తగ్గింపు వస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 21 వరకే ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై అయితే 10 శాతం తగ్గింప ఉంది. గరిష్టంగా రూ. 10 వేల వరకు తగ్గింపు వస్తుంది. అయితే మినిమమ్ ట్రాన్సాక్షన్ విలువ రూ. 15 వేలు ఉండాలి. ఈ ఆఫర్ డిసెంబర్ 20 వరకే ఉంటుంది.
మిస్డ్ కాల్‌తో రూ.50 లక్షలు దోచేశాడు.. ఈ కొత్త రకం మోసంతో జాగ్రత్త!
అలాగే డొమెస్టిక్ హోటల్స్ బుకింగ్‌పై కూడా ఆఫర్ ఉంది. గరిష్టంగా రూ. 5 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్ డిసెంబర్ 28 వరకు ఉంటుంది. బుధవారం నాడే ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ హోటల్ బుకింగ్‌పై అయితే 15 శాతం తగ్గింపు ఉంది. గరిష్టంగా రూ. 20 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 27 వరకు ఉంటుంది. కేవలం మంగళవారం మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్లు అన్నీ ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా వర్తిస్తాయి. అంటే మీరు మేక్ మై ట్రిప్ ద్వారా హాలిడే టూర్ ప్లాన్ చేసుకొని ఫ్లైట్స్ లేదా హోటల్స్ వంటి వాటిని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుంటే ఈ మేరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఇయర్ ఎండ్ టూర్ ప్లాన్ చేస్తూ ఉంటే ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit card, Latest offers, Offers, Tourism, Year Ender