హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reselling Business: రీసెల్లింగ్‌ ఐటమ్స్‌ ద్వారా లక్షల్లో లాభాలు సంపాదిస్తున్న దంపతులు

Reselling Business: రీసెల్లింగ్‌ ఐటమ్స్‌ ద్వారా లక్షల్లో లాభాలు సంపాదిస్తున్న దంపతులు

Reselling Business: రీసెల్లింగ్‌ ఐటమ్స్‌ ద్వారా లక్షల్లో లాభాలు సంపాదిస్తున్న దంపతులు
(image: Amazon)

Reselling Business: రీసెల్లింగ్‌ ఐటమ్స్‌ ద్వారా లక్షల్లో లాభాలు సంపాదిస్తున్న దంపతులు (image: Amazon)

Reselling Business | రీసెల్లింగ్‌ బిజినెస్ ఐడియాతో ఓ జంట లక్షల్లో లాభాలు సంపాదిస్తోంది. వీరి బిజినెస్ ఐడియా (Business Idea) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ బిజినెస్‌ (Online Business) ట్రెండింగ్‌లో ఉంది. పెద్ద పెద్ద ఈ కామర్స్ కంపెనీల నుంచి చిన్న రిటైలర్స్ వరకు తమ ప్రొడక్ట్స్ సెల్లింగ్ కోసం ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫారంలను వినియోగించుకుంటున్నారు. చాలా మంది ఇంటి వద్దే కూర్చుకుని ఆన్‌లైన్‌లో తమ ప్రొడక్ట్‌లు సేల్‌ చేస్తూ ఆదాయం అందుకుంటున్నారు. ఇప్పటికే అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌బాస్కెట్, eBay, వాల్‌మార్ట్‌ వంటి బడా కంపెనీలు ఇండియాతో పాటు ఇతర దేశాల్లో తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో కస్టమర్లు బుక్ చేసిన ప్రొడక్ట్స్ డెలివరీ అవుతాయి. కొన్ని రిటర్న్ అవుతాయి. వివిధ కారణాలతో కొన్ని ఓపెన్ చేయని ప్యాకేజీలను కస్టమర్లు తిరిగి ఆన్‌లైన్‌ కంపెనీలకు పంపించేస్తుంటారు. ఆ ఓపెన్ చెయ్యని ప్యాకేజీలను కొని రీసెల్లింగ్ చేస్తూ అమెరికాకు చెందిన దంపతులు రూ.లక్షలు సంపాదిస్తున్నారు. వారు బిజినెస్‌ ఎలా నిర్వహిస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

సరదా కోసం మొదలు పెట్టి.. రూ.లక్షలు సంపాదిస్తున్నారు

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు.. అమెరికన్‌ దంపతులు తొలుత సరదాగా మొదలుపెట్టిన పని.. ఇప్పుడు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఇస్తోంది. ఇప్పుడు అదే వారికి ప్రధాన ఆదాయ మార్గంగా మారింది. అమెరికాకి చెందిన సారా, మెకాలి దంపతులు రెండు సంవత్సరాల క్రితం ఒక డిస్ట్రిబ్యూటర్ బాక్సెడ్ కలెక్షన్లను ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ద్వారా విక్రయిస్తుండటం చూశారు. వీరు కూడా అదే పనిని అవకాశంగా అందిపుచ్చుకొని రూ.16 లక్షల ఆదాయం సంపాదించారు.

Jio True 5G: ఏపీలో జియో ట్రూ 5జీ సేవలు... మీ స్మార్ట్‌ఫోన్‌లో వాడుకోండి ఇలా

ఆన్‌లైన్‌ కంపెనీలకు కస్టమర్ నుంచి రిటర్న్ వెళ్లే ఓపెన్ చేయని బాక్సుల్లో ఉండే ప్రోడక్ట్లను కొనడం సులువని వీరు గమనించారు. వీటిని కొనే ఆసక్తి ఉన్నవారు దగ్గరలోని వేర్ హౌస్‌కి వెళ్లి ఒక బాక్స్‌కి దాదాపు 550 డాలర్లు చెల్లించాలి. కానీ ఆ బాక్స్‌లో ఏ ప్రోడక్టులు ఉంటాయో? వాటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో? తెలియదు.

ఇప్పటి వరకు నష్టం రాలేదు

మొదట్లో ఈ దంపతులు 25 ప్రొడక్టులు అమ్మి 1880 డాలర్‌ల ఆదాయం పొందారు. తర్వాత వారు క్రమక్రమంగా అమెజాన్ , వాల్‌మార్ట్‌లకు రిటర్న్ వచ్చే ప్రొడక్టులను వేర్‌హౌస్‌కి వెళ్లి కొని.. eBay, ఫేస్‌బుక్‌ మార్కెట్‌ ప్లేస్‌లలో అమ్మడం మొదలుపెట్టారు. ఇలా మొత్తంగా 19,500 డాలర్‌ల ఆదాయాన్ని పొందారు. రెండు వారాల్లో వారికి పెట్టిన సొమ్ము తిరిగి వచ్చేసింది. తర్వాత 4 నుంచి 8 వారాల్లో 90 శాతం ప్రొడక్టులు అమ్ముడుపోయాయి.

WhatsApp: న్యూ ఇయర్‌కు ముందు షాక్... ఈ 49 స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదు

ఇప్పటివరకు తమకు నష్టం రాలేదని మెకాలి చెప్పారు. మనం చేసే పనిని ఉద్యోగంలా భావించి ప్రారంభిస్తే నిజంగా డబ్బు సంపాదించగలమని సారా పేర్కొన్నారు. సరదా కోసం చేసిన పని డబ్బు సంపాదించడానికి మెరుగైన మార్గంగా మారిందని అన్నారు.

First published:

Tags: Amazon, Business Ideas, Flipkart, Online business, Online shopping

ఉత్తమ కథలు