కరోనా కష్టకాలంలో లక్షల కోట్లు వెనకేసుకున్నారు...అమెరికన్ బిలియనీర్లా...మజాకా...

అమెరికన్ బిలియనీర్లు మార్చి మధ్య నుండి మే మధ్య కాలంలొ అంటు కరోనా విస్తరిస్తున్న సమయంలో 434 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 32 లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు.

news18-telugu
Updated: May 23, 2020, 7:53 AM IST
కరోనా కష్టకాలంలో లక్షల కోట్లు వెనకేసుకున్నారు...అమెరికన్ బిలియనీర్లా...మజాకా...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
అమెరికాలో కరోనావైరస్ మహమ్మారి కాటు వేస్తున్నప్పటికీ, అక్కడి బిలియనీర్లు మాత్రం విపరీతంగా డబ్బు సంపాదించారు. ఒక నివేదిక ప్రకారం, అమెరికన్ బిలియనీర్లు మార్చి మధ్య నుండి మే మధ్య కాలంలొ అంటు కరోనా విస్తరిస్తున్న సమయంలో 434 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 32 లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. కష్ట కాలంలో కూడా అమెరికన్ బిలియనీర్ల సంపద రూ. 32 లక్షల కోట్లు పెరిగింది. సిఎన్‌బిసి నివేదిక ప్రకారం, అత్యధిక వసూళ్లు చేసిన అమెరికన్ బిలియనీర్లలో అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్, ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. డేటా ప్రకారం, జెఫ్ బెజోస్ ఈ కాలంలో తన సంపదను. 34.6 బిలియన్లు లేదా 2 లక్షల 62 వేల కోట్లు పెంచుకున్నారు.

అదేవిధంగా ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కూడా 25 బిలియన్ డాలర్లు, అంటే 1 లక్ష 89 వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈ నివేదికను అమెరికన్ ఫర్ టాక్స్ ఫెయిర్‌నెస్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ ప్రోగ్రామ్ ఫర్ ఇనిక్వాలిటీ తయారు చేసింది. ఈ నివేదికను రూపొందించడానికి ఫోర్బ్స్ డేటాను వినియోగించారు. మార్చి 18 మరియు మే 19 మధ్య, అమెరికాలోని 600 మంది బిలియనీర్ల సంపద వివరాలు సేకరించారు.

లాక్ డౌన్ ఉన్నప్పటికీ పలు టెక్ కంపెనీలు భారీ లాభాలను ఆర్జించాయి. ఈ కొత్త నివేదిక ప్రకారం, గత రెండు నెలల్లో, అమెరికన్ బిలియనీర్ల సంపద సుమారు 15 శాతం పెరిగింది. ఈ కాలంలో వారి సంపద 2.948 ట్రిలియన్ నుండి 3.382 ట్రిలియన్లకు పెరిగింది. వీరిలో టాప్ 5 బిలియనీర్లు జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, వారెన్ బఫ్ఫెట్, లారీ ఎల్లిసన్ అత్యధిక లాభాలు పొందారు. వారి సంపద మొత్తం 76 బిలియన్ డాలర్లు పెరిగింది.

ఎలోన్ మస్క్ సంపద కూడా ఎక్కువ శాతం పెరిగింది. గత రెండు నెలల్లో అతని సంపద దాదాపు 48 శాతం పెరిగింది. ఆయన మొత్తం ఆస్తుల విలువ 36 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జుకర్‌బర్గ్ ఈయన వెనుకే ఉన్నాడు. గత రెండు నెలల్లో జుకర్‌బర్గ్ సంపద 46 శాతం పెరిగింది. ఆయన సంపద 80 బిలియన్ డాలర్లకు చేరింది. అదే విధంగా, జెఫ్ బెజోస్ సంపద 31 శాతం పెరిగి 147 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Published by: Krishna Adithya
First published: May 23, 2020, 7:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading