Citi Bank: సిటీ బ్యాంక్ సంచలన నిర్ణయం... భారత్‌లో కన్స్యూమర్​ బ్యాంకింగ్​ వ్యాపారానికి గుడ్​బై

Citi Bank: సిటీ బ్యాంక్ సంచలన నిర్ణయం... భారత్‌లో కన్స్యూమర్​ బ్యాంకింగ్​ వ్యాపారానికి గుడ్​బై (ప్రతీకాత్మక చిత్రం)

Citi Bank Exit News | సిటీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. భారతదేశంలో కన్స్యూమర్ బిజినెస్ కార్యకలాపాల నుంచి తప్పుకుంటున్నట్టు సిటీ బ్యాంక్ ప్రకటించింది.

  • Share this:
అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్​ దిగ్గజం సిటీ బ్యాంక్​ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్​తో సహా 13 దేశాల్లో కన్స్యూమర్ బ్యాంకింగ్​ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ ప్రణాళికల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, సిటీ బ్యాంక్ కన్స్యూమర్ వ్యాపార విభాగం కింద​ ప్రస్తుతం క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్, హోమ్​ లోన్స్​, వెల్త్​ మేనేజ్​మెంట్​ వంటి సేవలందిస్తుంది. ప్రస్తుతం సిటీ బ్యాంకుకు దేశ వ్యాప్తంగా 35 శాఖలు ఉన్నాయి. కన్స్యూమర్​ బ్యాంకింగ్ వ్యాపారంలో సుమారు 4,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా నిర్ణయంపై సిటీ బ్యాంక్ గ్లోబల్​ సీఈఓ జేన్​ ఫ్రేజర్​ మాట్లాడుతూ ‘‘భారత్​ సహా 13 దేశాల్లో కన్స్యూమర్​ బ్యాంకింగ్ వ్యాపారాల నుండి వైదొలగాలని నిర్ణయించాం. ఈ మార్కెట్లలో తమ బ్యాంక్​ ఇతర బ్యాంకులతో పోటీపడలేకపోతుండటమే వైదొలగడానికి ముఖ్య కారణం.” అని ఆయన స్పష్టం చేశారు.

Indian Railways: సరిగ్గా ఇదే రోజు పరుగులు తీసిన మొదటి రైలు... ఏ రూట్‌లో తెలుసా?

SBI: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉందా? ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన బ్యాంకు

కాగా, సిటీ బ్యాంక్​ ఈ వ్యాపారం నుంచి ఎలా వైదొలగనుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కన్స్యూమర్​ బ్యాంకింగ్​ సేవల నుంచి తప్పుకోవాలంటే ఖచ్చితంగా రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ఆమోదమూ అవసరమవుతుంది. అందువల్ల, ఆర్​బీఐ నుంచి గ్రీన్​ సిగ్నల్​ వచ్చే వరకు యథావిధిగా తమ సేవలు అందించనున్నట్లు సిటీ బ్యాంక్​ ఇండియా చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆశు ఖుల్లార్​ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "తాజా ప్రకటనతో ప్రస్తుతానికైతే మా కార్యకలాపాల్లో తక్షణ మార్పులేమీ ఉండవు. అలాగే మా ఉద్యోగులపైనా దీని ప్రభావం ప్రభావం ఉండదు. కన్స్యూమర్​ సేవల నుంచి వైదొలిగేందుకు ఆర్​బీఐ నుంచి గ్రీన్​సిగ్నల్ వచ్చే వరకు మా కస్టమర్లకు అదే అంకితభావం, శ్రద్ధతో మెరుగైన సేవలు కొనసాగిస్తాము. అవసరమైన నియంత్రణ అనుమతులు రాగానే విక్రయ ప్రక్రియ పూర్తిచేస్తాము.’’ అని అన్నారు.

RTGS Services: అలర్ట్... 14 గంటలపాటు ఆ‌ర్‌టీజీఎస్ సేవలు బంద్... ఎప్పుడో తెలుసుకోండి

Money Transfer: పొరపాటున డబ్బులు వేరే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇలా చేయండి

1985 నుంచి కన్స్యూమర్​ బ్యాంకింగ్​ సేవలు


కాగా, అంతర్జాతీయ ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిటీ బ్యాంక్​ వెల్లడించింది. ఇకపై సంస్థాగత బ్యాంకింగ్​ వ్యాపారంతో పాటు ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై మరియు గురుగ్రామ్ నగరాల్లోని కేంద్రాల నుంచి గ్లోబల్​ వ్యాపార కార్యకలాపాల్లో సర్వీసులను అందించడంపై దృష్టి పెట్టనుంది. భారత్​లో తమకున్న ఈ అయిదు నగరాల్లోని సిటీ సొల్యూషన్ సెంటర్ల కార్యకలాపాలను మరింతగా పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నామని వివరించింది. ఇందులో భాగంగా కార్పొరేట్, కమర్షియల్​, ఇన్వెస్ట్​మెంట్​ బ్యాంకింగ్, ట్రెజరరీ, ట్రేడ్​ సొల్యూషన్స్​తో పాటు మార్కెట్లు, సెక్యూరిటీ సర్వీసులను మరింత బలోపేతం చేయడంలో దృష్టి సారించనుంది. కాగా, సిటీ బ్యాంక్​ శతాబ్దం క్రితం 1902లో భారతదేశంలోకి అడుగుపెట్టింది. 1985 నుండి కన్స్యూమర్​ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది.
Published by:Santhosh Kumar S
First published: