SEBI: ఇక‌పై మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో సంస్థ‌ ఉద్యోగులు పెట్టుబ‌డి పెట్టాల్సిందే

సెబీ ఆఫీస్ (ఫైల్)

అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (Asset Management Company) ల్లో పని చేసే ఉద్యోగులు ఇక‌పై త‌ప్ప‌నిస‌రిగా మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల‌ని సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (Securities and Exchange Board of India) స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది.

  • Share this:
    అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (Asset Management Company) ల్లో పని చేసే ఉద్యోగులు ఇక‌పై త‌ప్ప‌నిస‌రిగా మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల‌ని సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (Securities and Exchange Board of India)  స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. ఏఎంసీ (AMC) కంపెనీల్లో ప‌ని చేసే జూనియ‌ర్ స్థాయి సిబ్బంది ఇక‌పై వేత‌నంలో కొంత శాతం ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టేలా ఈ స‌ర్క్యూల‌ర్ (Circular) పేర్కొంది. ఈ నిబంధ‌న‌లు ఈ ఏడాది(2021) అక్టోబర్‌ 1నుంచి అమ‌లు చేస్తారు. అంతే కాకుండా 2022 అక్టోబర్‌ నుంచి 15 శాతం, 2023 అక్టోబర్‌ 1 నుంచి 20 శాతం వేతనాన్ని సంస్థకు చెందిన మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Fund) యూనిట్ల‌లో పెట్ట‌బ‌డి పెట్టాల్సి ఉంటుంది.

    ఈ ఏడాది ఏఎంసీ (AMC) జూనియర్‌స్థాయి సిబ్బంది తొలుత వేతనాలలో 10 శాతాన్ని ఫండ్‌ హౌస్‌ యూనిట్లలో ఇన్వెస్ట్ చేయాలి. వ‌చ్చే ఏడాది 2022 అక్టోబర్‌ల నుంచి 15 శాతం, ఇక 2023 అక్టోబర్‌ 1 నుంచి జూనియర్‌ ఉద్యోగులందరూ 20 శాతం వేతనాన్ని ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల (Capital Market) నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సర్క్యులర్‌ను జారీ చేసింది. ఫండ్‌ హౌస్‌ యూనిట్లలో ఇన్వెస్ట్‌ చేసిన ఉద్యోగులకు పెట్టుబడులపై మూడేళ్ల లాక్ వర్తిస్తుంది. తదుపరి కొత్త పెట్టుబడులకు మారుగా వీటిని మరో మూడేళ్లు కొనసాగించుకోవచ్చు.

    EPF: పీఎఫ్ అకౌంట్ నుంచి కేవలం ఒక్క గంటలో రూ. 1లక్ష విత్ డ్రా చేసుకునే చాన్స్...ఇలా ఫాలో అవ్వండి..


    ఎవ‌రికి వ‌ర్తిస్తుంది..
    సెబీ (SEBI) తాజా నిబంధనలు ఏఎంసీ (AMC) కంపెనీలకు చెందిన కీలక ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. ఏఎంసీలలో పనిచేసే 35 ఏళ్లకంటే తక్కువ వయసుగల ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగులను జూనియర్‌ సిబ్బందిగా పరిగణించనున్నారు. 35ఏళ్ల వయసు దాటిన జూనియర్‌ ఉద్యోగులకు దశలవారీ పెట్టుబడుల నిబంధన వర్తించదు. ఇందులో నుంచి సీఈవో, హెచ్ఓడీలు, ఫండ్ మేనేజ‌ర్ల‌ (Managers)ను మిన‌హాయిస్తారు. ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలో భాగమున్న ఉద్యోగులందరూ నిబంధనల పరిధిలోకి వ‌స్తారు. తాజా నిబంధనలు ఏఎంసీ కంపెనీలకు చెందిన కీలక ఉద్యోగులందరికీ వర్తించనున్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ పథకా ల యూనిట్‌దారులతో కంపెనీ ఉద్యోగులను అనుసంధానం చేసే లక్ష్యంతో సెబీ తాజా నిబంధనలను ప్రవేశపెట్టినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ ప్రతినిధులు, మ్యూచు వల్‌ ఫండ్స్‌ సలహా కమిటీ సూచనల మేరకు ప‌లు అంశాల‌పై సెబీ స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను (Guide lines) జారీ చేసింది.
    Published by:Sharath Chandra
    First published: