Ambrane: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు అంబ్రేన్ (Ambrane) బడ్జెట్ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు తీసుకొస్తూ భారత యూజర్లను తన వైపు తిప్పుకుంటోంది. తాజాగా ఈ కంపెనీ రెండు సరికొత్త అడ్వెంచర్ స్మార్ట్‌వాచ్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఔట్‌డోర్ పరిస్థితులలో సైతం తట్టుకోగల ఈ స్మార్ట్‌వాచ్‌లను చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చింది. వైజ్ క్రెస్ట్ (Wise Crest), వైజ్ స్టడ్ (Wise Stud) పేర్లతో లాంచ్ అయిన ఈ కొత్త వాచ్‌లు దృఢమైన బిల్ట్ క్వాలిటీతో వస్తాయి.
పెద్ద స్క్రీన్, క్వాలిటీ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఏడాది కాలం పాటు వారంటీతో తాజా వాచ్‌లు లాంచ్ అయ్యాయి. వీటిలో మరెన్నో అద్భుతమైన ఫీచర్లను కంపెనీ అందించింది. లాంచింగ్ ఆఫర్‌లో వీటిని కేవలం రూ.2 వేలకే సొంతం చేసుకోవచ్చు. వీటి అసలు ధర ఎంత, అవి ఆఫర్ చేసే ఆకర్షణీయమైన ఫీచర్లేవో తెలుసుకుందాం.
* ఫీచర్లు
కొత్త వైజ్ క్రెస్ట్ వాచ్ స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకుంటోంది. 500 నిట్స్ బ్రైట్‌నెస్, 360×360 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్ డిస్‌ప్లే రౌండ్ షేప్‌లో ఉంటుంది. 1.39-అంగుళాల లూసిడ్ డిస్‌ప్లేను దీనిలో అందించారు. ఇక వైజ్ స్టడ్ స్మార్ట్‌వాచ్ 500 నిట్స్ బ్రైట్‌నెస్, 240×284 రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ స్టడ్ స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే స్క్వేర్ షేప్‌లో ఉంటుంది. దీనిలో 1.85-అంగుళాల లూసిడ్ డిస్‌ప్లేను అందించారు. రెండూ మెటల్ బిల్డ్ కలిగి ఉంటాయి. ఎక్కువ కాలం మన్నే దృఢమైన గ్లాస్ ఈ రెండింటిలోనూ ఉన్నాయి. ఇంపాక్ట్ రెసిస్టెన్స్, IP68 వాటర్ రెసిస్టెన్స్ బాడీతో ఇవి మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి.
సిలికాన్ స్ట్రాప్‌తో వచ్చే ఈ వాచ్‌లు చర్మానికి ఎలాంటి హాని చేయవు. అలాగే వాచ్‌లను ఎప్పుడూ పొడిగానే ఉంచుతాయి. 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తాయి. అంతేకాదు, AI వాచ్ ఫేస్‌లు సైతం వీటిలో ఆఫర్ చేశారు. ఇవి యూజర్ల దుస్తులతో వాచ్ ఫేస్ మ్యాచ్ అయ్యేలా మారతాయి. అంబ్రేన్ వైజ్ క్రెస్ట్, వైజ్ స్టడ్‌లలోని ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్లు బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ స్మార్ట్‌వాచ్‌ల ద్వారా కాల్స్ చేసుకోవడమే కాకుండా కాల్ లాగ్స్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు.
వీటిలో హార్ట్ రేట్ సెన్సార్, SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకర్, పీరియడ్ ట్రాకర్ ఉన్నాయి. కాగా వైజ్ క్రెస్ట్ రక్తపోటు (BP)ను కొలిచే ఫీచర్‌ను అదనంగా కలిగి ఉంది. అయితే వైజ్ స్టడ్‌లో బీపీని కొలిచే సామర్థ్యాన్ని అందించలేదు. ఈ వాచ్‌లతో బ్రీత్ ట్రైనింగ్ కూడా ప్రారంభించవచ్చు. స్టెప్స్, కేలరీలు, దూరాన్ని ట్రాక్ చేయవచ్చు. 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ప్రయత్నించవచ్చు. 400mAh బ్యాటరీతో వచ్చే ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు నిరంతర వాడకంలో గరిష్ఠంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ని ఆఫర్ చేస్తాయి. స్టాండ్ బై మోడ్‌లో 25 రోజులపాటు బ్యాకప్ ఇస్తాయి.
ఈ వాచ్‌లు స్మార్ట్ నోటిఫికేషన్లు, వాతావరణ అప్‌డేట్లు, కెమెరా/మ్యూజిక్ కంట్రోల్స్, ఫైండ్ ఫోన్ ఫీచర్ వంటి వాటిని ఆఫర్ చేస్తాయి. గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి ద్వారా వాయిస్ అసిస్టెన్స్‌ని అందిస్తాయి. వైజ్ స్టడ్ ఇన్‌బిల్ట్ గేమ్‌లతో కూడా వస్తుంది. వైజ్ క్రెస్ట్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో వస్తే.. వైజ్ స్టడ్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
* ధర
అంబ్రేన్ వైజ్ క్రెస్ట్, వైజ్ స్టడ్ రెండూ రూ.1,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ , కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ వైజ్ క్రెస్ట్ అసలు ధరను రూ.6,499గా, వైజ్ స్టడ్ అసలు ధరను రూ.5,999గా నిర్ణయించింది. లాంచింగ్ ఆఫర్ ముగిసిన తర్వాత అసలు ధరల్లోనే వాచ్‌లు అమ్ముడవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Smartwatch