Amazon Pharmacy: త్వరలోనే ఔషధాల హోం డెలివరీలోకి అడుగుపెట్టనున్న అమెజాన్..

జెడి పవర్ ప్రకారం, యుఎస్‌లో ఆన్‌లైన్‌లో ఔషధ పంపిణీ ఆర్డర్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, అమెజాన్ ఫార్మసీ భారీ సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది.

news18-telugu
Updated: November 18, 2020, 2:27 PM IST
Amazon Pharmacy: త్వరలోనే ఔషధాల హోం డెలివరీలోకి అడుగుపెట్టనున్న అమెజాన్..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఇప్పుడు మెడిసిన్స్ డోర్ డెలివరీ చేసేందుకు సైతం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ సంస్థ అమెజాన్ ఫార్మసీ పేరుతో యుఎస్ లో సర్వీసెస్ ప్రారంభించింది. అమెజాన్ ఫార్మసీ ఇప్పటికే అమెరికాలోని ఔషధ రిటైలర్లు వాల్‌గ్రీన్స్, సివిఎస్, వాల్‌మార్ట్‌లకు గట్టి పోటీని ఇస్తోంది. కాగా ప్రిస్క్రిప్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేయడానికి అమెజాన్ ఆన్‌లైన్ ఫార్మసీ పేరిట ఈ సర్వీసును ప్రారంభించింది. అయితే అమెజాన్ త్వరలో ఆన్‌లైన్ ఫార్మసీని ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించాలని యోచిస్తోంది. అమెజాన్ ఫార్మసీ వెబ్‌సైట్‌లో లేదా దాని యాప్‌లో, ఔషధాన్ని కొనుగోలు చేసే ముందు వినియోగదారులకు వివిధ బ్రాండ్లతో ధరను పోల్చడానికి కూడా సౌకర్యం కల్పిస్తోంది.

అమెజాన్ లాయల్టీ క్లబ్ సభ్యులకు ఈ యాప్ నుంచి ఔషధాల కొనుగోలు చేస్తే మంచి తగ్గింపు లభిస్తోంది. అమెరికాలో ప్రిస్క్రిప్షన్ ఆధారిత ఔషధాల ఇంటి డెలివరీ కోసం కంపెనీ రెండేళ్లుగా పనిచేస్తోందని అమెజాన్ తెలిపింది. ఈ సమయంలో, కంపెనీ అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుండి ఔషధ పంపిణీ కోసం లైసెన్స్ తీసుకొని సరఫరా చెయిన్ ను ఏర్పాటు చేసింది. అయితే ఇఫ్పటికే ఔషధ రిటైలర్లు వాల్‌గ్రీన్స్, సివిఎస్ హెల్త్, వాల్‌మార్ట్, రైట్ ఎయిడ్, కార్జర్‌తో సహా పలు కంపెనీలతో పోటీ పడాల్సి ఉంటుంది. దీంతో ఈ రంగంలో అమెజాన్ మార్గం సులభం అంత కాదని అమెరికన్ మార్కెట్ పరిశోధన సంస్థ జెడి పవర్ తెలిపింది.

అమెజాన్ ఫార్మసీ ఈ సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది

జెడి పవర్ ప్రకారం, యుఎస్‌లో ఆన్‌లైన్‌లో ఔషధ పంపిణీ ఆర్డర్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, అమెజాన్ ఫార్మసీ భారీ సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో అమెరికాలో కరోనా వైరస్ కారణంగా ఆన్‌లైన్‌లో మెడిసిన్ కొనుగోలు చేసే ధోరణి పెరిగిందని జెడి పవర్ తెలిపింది. అదే సమయంలో, అమెజాన్ తన లాయల్టీ సభ్యులకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో కంపెనీ అమెరికాలోని ఇతర కంపెనీలతో పోటీపడి డ్రగ్స్ డెలివరీ రంగంలో అడుగు పెట్టే అవకాశం కలిగింది.
Published by: Krishna Adithya
First published: November 18, 2020, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading