Future-Reliance deal: అమెజాన్‌కి ఊరట... నిలిచిన ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ డీల్

అమెజాన్‌కి ఊరట... నిలిచిన ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ డీల్ (File)

Future-Reliance deal: ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ మధ్య కుదిరిన డీల్ ఏంటి? ఎందుకు అది ఆగిపోయింది? ఫ్యూచర్ గ్రూప్‌కి మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏం చెప్పింది?

  • Share this:
    Future-Reliance deal: సింగపూర్‌కి చెందిన మధ్యవర్తిత్వ (Arbitration) ప్యానెల్... అక్టోబర్ 25న ఇచ్చిన మధ్యంతర ఆదేశంతో... అమెజాన్ డాట్ కామ్‌ విజయం సాధించినట్లైంది. ఈ వివాదంలో... రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి భాగస్వామ్య ప్యూచర్ గ్రూప్... తన రిటైల్ బిజినెస్‌ను రూ.24,713 కోట్లకు అమ్మదలచింది. ఈ డీల్‌ను మధ్యవర్తిత్వ ప్యానెల్ ఆపివేసింది. దాంతో... ఈ రెండు కంపెనీల మధ్య కుదరబోయిన డీల్ నిలిచిపోయింది. కిషోర్ బియానీ సారధ్యంలోని ఫ్యూచర్ గ్రూప్... కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తోందని... ఆమెజాన్... మధ్యవర్తిత్వ ప్యానెల్‌ను ఆశ్రయించింది. నిజానికి ఆగస్టు 2020లో వాటాల అమ్మకం ద్వారా... ఫ్యూచర్ గ్రూప్... రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెట్ (RRVL)తో డీల్ కుదుర్చుకుంది. ఇప్పుడా డీల్ ఆగిపోయింది.

    సరైన చట్టపరమైన సలహాలతోనే... RRVL... ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్‌కి చెందిన ఆస్తుల బదలాయింపు డీల్ కుదుర్చుకుంది. డీల్ మొత్తం భారత చట్టాలను అనుసరించే జరుపుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజా ప్రకటనలో తెలిపింది. RRVL... ఒప్పందం ప్రకారమే... ఆలస్యం లేకుండా ఈ డీల్ పూర్తి చేయాలనుకుంటున్నట్లు రిలయన్స్ తన ప్రకటనలో వివరించింది.

    డీల్‌కి సంబంధించి రిలయన్స్ తాజా ప్రకటన


    గతేడాది ఇదే ఫ్యూచర్ గ్రూపుతో అమెజాన్ డీల్ కుదుర్చుకుంది. అది ఏంటంటే... ఫ్యూచర్ గ్రూపుకి చెందిన లిస్ట్ కాని సంస్థలలో 49 శాతం వాటాలు కొనేందుకు ఒప్పుకుంది. అలాగే... ఫ్యూచర్ రిటైల్ ని కూడా... మూడు నుంచి పదేళ్ల కాలానికి కొనేలా డీల్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో RRVLతో ఫ్యూచర్ రిటైల్ డీల్ కుదుర్చుకోవడంతో... ఆమెజాన్ చట్టపరంగా తేల్చుకునేందుకు సిద్ధమైంది. రిలయన్స్ తో కుదిరిన డీల్ ప్రకారం... రిటైల్, హోల్ సేల్ లాజిస్టిక్స్, గిడ్డంగులను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి అమ్మినట్లు అవుతుంది. అది సరైన డీల్ కాదని... తమ మధ్య కుదిరిన డీల్‌కి వ్యతిరేకం అని అమెజాన్ వాదించింది.

    దీనిపై మధ్య వర్తిత్వ ప్యానెల్ విచారణ జరిపి... ఫ్యూచర్ గ్రూపును... RRVL...తో కుదిరిన డీల్‌ను నిలిపివేయమని ఆదేశించింది. ఆమెజాన్ తో కుదుర్చుకున్న డీల్ సంగతి ముందు తేలాకే... ఈ కొత్త డీల్ సంగతి చూసుకోమంది. దీనిపై స్పందించిన ఆమెజాన్ ప్రతినిధి... తమకు ఊరట కలిగిందన్నారు. చివరకు మధ్యవర్తిత్వ ప్యానెల్ చెప్పినట్లుగానే ప్రక్రియ ఉంటుందనే అంచనాతో ఉన్నామని తెలిపారు.

    నిజానికి ఈ డీల్ కుదిరివుంటే... రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ఇది ప్లస్ పాయింట్ అయ్యేది. ఇండియాలో అతి పెద్ద రిటైలర్ గా దాదాపు రెట్టింపు స్థాయిలో రిలయన్స్ విస్తరించేది. ఈ వివాదంతో... ఇండియాలో 1 ట్రిలియన్ డాలర్ల రిటైల్ మార్కెట్ లో రిలయన్స్, అమెజాన్ మధ్య పోటీ మరింత పెరిగిందనుకోవచ్చు. మధ్యవర్తిత్వ ప్యానెల్‌లో అమెజాన్ కి చెందిన ఓ సభ్యుడు ఉండగా... ఫ్యూచర్ నుంచి మరో సభ్యుడు ఉన్నారు. మూడో సభ్యుడు తటస్థంగా ఉన్నారు. 90 రోజుల్లో వివాదానికి ముగింపు లభిస్తుందనే అంచనా ఉంది.

    Disclaimer: Reliance Industries Ltd. is the sole beneficiary of Independent Media Trust which controls Network18 Media & Investments Ltd.
    Published by:Krishna Kumar N
    First published: