Home /News /business /

AMAZON WILL BE LAUNCHING AN INNOVATIVE CLOTHING STORE THIS YEAR AND SHOPPING CAN BE DONE IN A COMPLETELY VIRTUAL MANNER PRV GH

Amazon: షాపింగ్ చేసేవారికి అమెజాన్ వర్చువల్ హెల్ప్.. అల్గారిథమ్ ద్వారా మీకు సెట్ అయ్యే దుస్తులు రికమెండ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫ్యాషన్‌ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా AMAZON ఈ సంవత్సరం ఒక వినూత్న దుస్తుల దుకాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫిజికల్‌గా ఎటువంటి రిటెయిలింగ్‌ ఉండదు. పూర్తిగా వర్చువల్ విధానంలోనే షాపింగ్ చేసుకోవచ్చు

కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ (Online shopping) సైట్స్‌ చిత్రవిచిత్రాలు చేస్తుంటాయి. రకరకాల ఆఫర్లు అందించడమే కాదు వినూత్న వస్తువులనూ పరిచయం చేస్తాయి. తాజాగా ఫ్యాషన్‌ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా AMAZON ఈ సంవత్సరం ఒక వినూత్న దుస్తుల దుకాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫిజికల్‌గా ఎటువంటి రిటెయిలింగ్‌ ఉండదు. పూర్తిగా వర్చువల్ విధానంలోనే షాపింగ్ చేసుకోవచ్చు. Amazon Style పేరుతో లాస్‌ ఎంజెల్స్ శివారులోని గ్లెండేల్‌లో 30,000 స్క్వేర్‌ ఫీట్‌.. అంటే సుమారు 2787 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ షాప్‌ ఏర్పాటు చేస్తున్నారు. మామూలు డిపార్టుమెంటల్‌ స్టోర్లతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఈ షాపులోకి వచ్చిన కస్టమర్లు అక్కడి ర్యాక్స్‌లో ఉండే దుస్తులను Amazon మొబైల్‌ యాప్‌ ద్వారా స్కాన్‌ (Scan) చేసి కలర్‌, సైజు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ దుస్తులు సరిపోతున్నాయా లేదా అని చెక్‌ చేసుకునేందుకు కస్టమర్లు ట్రయల్‌ రూమ్‌ కోసం వర్చువల్‌ క్యూలో నిల్చోవాలి. అది రెడీగా ఉన్నప్పుడు వాళ్లు స్మార్ట్‌ఫోన్‌తో ఆ రూమ్‌ అన్‌లాక్‌ చేయవచ్చు.

ఈ ట్రయల్‌ రూమ్‌ (Trial Room) అనేది మీరు షాపింగ్‌ చేసుకునేందుకు ఉద్దేశించిన వ్యక్తిగత స్థలం. దాన్ని మీరు వదలాల్సిన అవసరం ఉండదని ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న మేనేజింగ్‌ డైరెక్టర్‌ Simoina Vasen తెలిపారు. ప్రతి దానిలో ఒక టచ్‌ స్క్రీన్‌ ఉంటుంది, దాని ద్వారా కస్టమర్లు మరిన్ని వస్తువులు కోరవచ్చు. రెండు వైపులా ఉండే ఈ బీరువాలో అక్కడి సిబ్బంది సురక్షితంగా వాటిని అందిస్తారు.
ఈ దుస్తులు మీకు బాగుంటాయని కూడా టచ్‌ స్క్రీన్లు (Touch screens) చెబుతాయి. కస్టమర్లు స్కాన్‌ చేసే వాటిని Amazon రికార్డు చేసుకొని ఆ అల్గారిథమ్స్‌ ఆధారంగా దుస్తులు రికమెండ్‌ చేస్తాయి. కస్టమర్లు స్టైల్‌ సర్వేలోనూ పాల్గొనవచ్చు. కావాలనుకుంటే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది సాయాన్ని తీసుకోవచ్చని Amazon తెలిపింది.

చిల్లర దుకాణాలకు ధీటుగా..

దుస్తుల విషయంలో కస్టమర్లకు సాయపడేందుకు గతంలోనూ టెక్నాలజీ సాయాన్ని Amazon తీసుకుంది. అమెరికాలో అతి పెద్ద దుస్తుల విక్రేతగా నిలిచిన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ను వెనక్కి నెట్టేసింది. కానీ Macy’s, Nordstrom వంటి వాటితో Amazon ఇంకా పోటీ పడాల్సి ఉంది. మరోవైపు Amazon ప్రారంభించిన కిరాణ దుకాణాలు సాధారణ చిల్లర దుకాణాలకు దీటుగా నిలబడలేకపోతున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు వందలాది బ్రాండ్లను ఈ దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని Amazon భావిస్తోంది.

అమెజాన్‌కు వందలాదిగా అసోసియేటర్లు ఉన్నారు. క్యాషియర్‌ అవసరం లేని చెక్‌ ఔట్‌ విధానం కూడా అమెజాన్‌ స్టోర్స్‌లో ఉంది. Amazon One అనే బయోమెట్రిక్‌ విధానం కూడా ఉపయోగిస్తుంది. దీని ద్వారా కస్టమర్లు తమ అరచేతిని స్వైప్‌ చేసి చెల్లింపులు జరపవచ్చు. $ 10 ఖరీదు చేసే సాధారణ జీన్స్‌ నుంచి $400 విలువ చేసే డిజైనర్‌ జీన్స్‌ వరకు ప్రతీది ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.
ఈ హైటెక్‌ షాపింగ్‌, వర్చువల్‌ ఛేంజింగ్‌ రూమ్స్‌తో కూడిన Amazon Styleను చూస్తున్న ఈ రంగం నిపుణులు భవిష్యత్‌ ఇలాగే ఉంటుందేమోనని అనుకుంటున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Amazon, Online shopping

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు