Home /News /business /

AMAZON WEB SERVICES INVEST 20761 CRORES IN TELANGANA SU

Amazon Investment in Telangana: తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి.. భారీగా ఉద్యోగ అవకాశాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో అమెజాన్ మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది.

    తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ సంస్థ ముందుకొచ్చింది. 20,761 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్ట అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. అలాగే తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో అమెజాన్ మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి అవైలబిలిటీ జోన్‌లో కూడా అనేక డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి .2022 సంవత్సర ప్రథామార్దం లో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలిపింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కార్యకలాపాలు ప్రారంభం అయితే భారీగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

    తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి పెట్టడాన్ని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని అన్నారు.అమెజాన్ సంస్థ ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యత అర్థం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక, వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ తనను దావోస్ పర్యటనలో కలిసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.





    అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి తర్వాత తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ గమన్యస్థానంగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పెట్టుబడి ద్వారా ఇప్పటికే అతిపెద్ద కార్యాలయాన్ని కలిగి ఉన్న అమెజాన్ సంస్థతో తెలంగాణ బంధం మరింత బలోపేతం అవుతుందని మంత్రి అన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Amazon, KTR, Telangana

    తదుపరి వార్తలు