AMAZON TO BEGIN DRONE DELIVERIES LATER THIS YEAR FIRST IN LOCKEFORD CALIFORNIA USA GH MKS
Amazon Drone Delivery: ఈ ఏడాది నుంచే అమెజాన్ డ్రోన్ డెలివరీ సేవలు.. ఎక్కడ ఆరంభిస్తారంటే..
ప్రతీకాత్మక చిత్రం
ఈ ఏడాది చివర్లో మొదటిసారిగా డ్రోన్ ద్వారా షాపర్లకు పార్సిల్లను డెలివరీ చేయనున్నట్లు అమెజాన్(Amazon) తెలిపింది. దీనికి సంబంధించిన ఫైనల్ రెగ్యులేటరీ ఆమోదం వివరాలు, తొలుత ఏ నగరంలో చేపట్టబోయేది వెల్లడించింది..
ఈ ఏడాది చివర్లో మొదటిసారిగా డ్రోన్ ద్వారా షాపర్లకు పార్సిల్లను డెలివరీ చేయనున్నట్లు అమెజాన్(Amazon) తెలిపింది. దీనికి సంబంధించిన ఫైనల్ రెగ్యులేటరీ ఆమోదం పెండింగ్‌లో ఉందని పేర్కొంది. కాలిఫోర్నియా, లాక్ఫోర్డ్లోని వినియోగదారులు తమ ఇళ్లకు వస్తువులను ఎయిర్ డెలివరీ చేయడానికి సైన్ అప్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. కొన్నేళ్ల క్రితమే డ్రోన్ ద్వారా పార్సిళ్లను డెలివరీ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అయితే కొన్ని సమస్యల కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది.
అయితే తొలిసారిగా లాక్ఫోర్డ్ వినియోగదారులకు డ్రోన్ డెలివరీ సర్వీసును అందిస్తున్నామని, ఆ తర్వాత ఈ సేవలను మరింత విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు చెప్పింది. డ్రోన్ డెలివరీ(Drone Delivery) హామీ సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తోందని ఒక బ్లాగ్ పోస్ట్‌లో అమెజాన్ తెలిపింది. కానీ ఈ సంవత్సరం తరువాత, కాలిఫోర్నియాలోని లాక్ఫోర్డ్లో నివసిస్తున్న అమెజాన్ కస్టమర్లు ప్రైమ్ ఎయిర్ డెలివరీలను స్వీకరించగలరని పేర్కొంది.
ప్రైమ్ ఎయిర్ గురించి అక్కడి వినియోగదారులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ప్రతిచోటా కస్టమర్ల అవసరాలను తీర్చడానికి సురక్షిత సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. దాదాపు 4,000 మంది జనాభా ఉన్న లాక్ఫోర్డ్లోని కస్టమర్ల బ్యాయ్యార్డ్లలో పార్సిళ్లను డ్రోన్ ద్వారా వదిలేలా ప్రోగ్రామ్ చేస్తామని అమెజాన్ స్పష్టం చేసింది.
"బియాండ్-లైన్-ఆఫ్-సైట్" డ్రోన్లు ఎగురుతాయని, వాటిని కంట్రోల్ చేసేందుకు అబ్సర్వర్ అవసరం లేదని, విమానాలు, వ్యక్తులు, పెంపుడు జంతువులు వంటి అడ్డంకులను అధిగమించేందుకు సెన్సార్లను ఉపయోగిస్తాయని తెలిపింది. కస్టమర్లకు ఒక గంటలోపు సురక్షితంగా ప్యాకేజీలను అందజేయడమే లక్ష్యం అని అమెజాన్ తెలిపింది.
గతంలో అమెజాన్ తన ప్రైమ్ మెంబర్షిప్ సర్వీస్‌కు పబ్లిసిటీ పెంచుకోవడానికి డ్రోన్ డెలివరీ ప్రచారాన్ని ఉపయోగించుకుంటోందనే ఆరోపణలు వినిపించాయి. 2013లో అమెజాన్ మాజీ బాస్, వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఐదేళ్లలోపు డెలివరీ డ్రోన్లతో ఆకాశాన్ని నింపుతామని చెప్పారు. అదే విధంగా 2019లో అమెజాన్ కొన్ని నెలల్లోనే కస్టమర్లకు డ్రోన్ డెలివరీ సేవలు అందించనున్నట్లు తెలిపింది.
ఏప్రిల్‌లో న్యూస్ సైట్ బ్లూమ్‌బెర్గ్ డ్రోన్లపై భద్రతా సమస్యలను ప్రశ్నించింది. అయినప్పటికీ అన్ని నిబంధనలను పాటిస్తే సురక్షితంగా సేవలు అందించే డ్రోన్లను వినియోగిస్తామని అమెజాన్ చెప్పింది.
2016 డిసెంబర్లో యూకేలోని కేంబ్రిడ్జ్‌లో అమెజాన్ డ్రోన్లను విజయవంతంగా పరీక్షించింది. డ్రోన్ ద్వారా 13 నిమిషాల్లో ఒక ప్యాకేజీని డెలివరీ చేసింది.అప్పటి నుంచి యూఎస్ రిటైలర్ వాల్‌మార్ట్, కొరియర్ సంస్థలు FedEx, UPS భాగస్వామ్యంతో డ్రోన్ డెలివరీలను అమెజాన్ పరీక్షిస్తోంది.
ప్రైమ్ ఎయిర్ డెలివరీల గురించి అమెజాన్ ఓ ప్రకటనలో.. ‘ఒకసారి ఆన్‌బోర్డ్ చేసిన తర్వాత, లాక్ఫోర్డ్లోని కస్టమర్లు అమెజాన్ ప్రైమ్‌లో ఎయిర్ డెలివరీకి అర్హత గల వస్తువులను చూడగలరు. వాటిని సాధారణంగానే ఆర్డర్ చేయగలరు. ఆర్డర్ స్టేటస్‌ను ట్రాకర్ సాయంతో తెలుసుకోవచ్చు. డెలివరీ చేసేందుకు డ్రోన్ సంబంధిత అడ్రెక్కు చేరుకుంటుంది. కస్టమర్ బ్యాక్యార్డ్లోకి దిగి, సురక్షితమైన ఎత్తులో ఉంటుంది. సురక్షితంగా ప్యాకేజీని విడుదల చేసిన తర్వాత తిరిగి గాల్లోకి ఎగిరి రిటర్న్ వస్తుంది’ అని తెలిపింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.