హోమ్ /వార్తలు /బిజినెస్ /

Amazon Small Business Day 2020: రేపే అమెజాన్‌లో స్మాల్ బిజినెస్ డే... ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్స్

Amazon Small Business Day 2020: రేపే అమెజాన్‌లో స్మాల్ బిజినెస్ డే... ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amazon Small Business Day 2020 | అమెజాన్‌లో డిసెంబర్ 12న స్మాల్ బిజినెస్ డే జరగనుంది. ఆఫర్ల వివరాలు తెలుసుకోండి.

ఆన్‌లైన్ షాపింగ్‌లో కొత్తగా ఏవైనా ప్రొడక్ట్స్ కొనాలనుకుంటున్నారా? ఆన్‌లైన్ షాపింగ్ చేసే ఆలోచనలో ఉన్నారా? అమెజాన్ యూజర్లకు గుడ్ న్యూస్. అమెజాన్ మరోసారి స్మాల్ బిజినెస్ డే 2020 నిర్వహిస్తోంది. ఈ సేల్ ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తుంది అమెజాన్. 2020 డిసెంబర్ 12న ఈ సేల్ జరగనుంది. వరుసగా నాలుగో సారి అమెజాన్ నిర్వహిస్తున్న స్మాల్ బిజినెస్ డే సేల్ ఇది. డిసెంబర్ 12న 24 గంటల పాటు ఈ సేల్ ఉంటుంది. స్టార్టప్స్, మహిళా ఆంట్రప్రెన్యూర్స్, చేతి వృత్తులు, చేనేత కళాకారులు, స్థానిక షాపులను ప్రోత్సహించేందుకు అమెజాన్ ఈ సేల్ నిర్వహిస్తోంది. చిరు వ్యాపారులకు మద్దతుగా నిలవడంతో పాటు వారి వ్యాపారం వృద్ధి చెందేలా ప్రోత్సహించడమే ఈ సేల్ లక్ష్యం. గృహ అవసరాలు, భద్రత, హైజీన్, వాల్ డెకరేషన్, ఇకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్, కిచెన్ వేర్, స్పోర్ట్స్ లాంటి ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ అందిస్తోంది అమెజాన్. ఈ సేల్‌లో హోమ్ డెకార్‌పై 50 శాతం, ఫర్నీషింగ్‌పై 60 శాతం, ఫర్నీచర్‌పై 50 శాతం, కిచెన్ అప్లయెన్సెస్‌పై 60 శాతం, డిన్నర్‌వేర్‌పై 60 శాతం, స్టోరేజ్ అండ్ ఆర్గనైజేషన్‌పై 50 శాతం, చీరలపై 70 శాతం, కుర్తీలపై 70 శాతం, మెన్స్‌వేర్‌పై 70 శాతం, కిడ్స్ వేర్‌పై 60 శాతం, జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్‌పై 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

Saral Jeevan Bima: తక్కువ ప్రీమియంతో రూ.25 లక్షల టర్మ్ ఇన్స్యూరెన్స్... జనవరి 1న ప్రారంభం

IRCTC: మీరు ఎక్కాల్సిన రైలు ఆలస్యంగా వస్తోందా? తెలుసుకోండి ఇలా

కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ అందించేందుకు ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.1,000 వరకు తగ్గింపు పొందొచ్చు. కనీసం రూ.1,000 కొన్నవారికి కూడా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్‌కి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనేవారికి 5 శాతం ఇన్‍స్టంట్ డిస్కౌంట్, 5 శాతం రివార్డ్స్ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. క్యాన్సిల్, రిజెక్ట్, రిటర్న్ ఆర్డర్స్‌కు ఈ ఆఫర్ వర్తించదు.

2020 జూన్ 27న కూడా స్మార్ట్ బిజినెస్ డే నిర్వహించింది అమెజాన్. ఈ సేల్‌లో 45,000 సెల్లర్స్ పాల్గొన్నారు. వీరిలో 2,600 మంది సెల్లర్స్‌కు భారీగా సేల్స్ వచ్చాయి. చిరు వ్యాపారులకు మద్దతుగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ డే పేరుతో అప్పుడప్పుడు ఈ సేల్ నిర్వహిస్తుంది అమెజాన్.

First published:

Tags: Amazon, AMAZON INDIA, Amazon prime

ఉత్తమ కథలు