Amazon చేస్తున్న కుట్ర ఇదే...రూ.1431 కోట్లతో రూ.30 వేల వ్యాపారం ఆక్రమించుకోవాలని ప్లాన్...

అమెజాన్ ఇప్పటి వరకూ ఎఫ్‌సిఎల్‌లో పెట్టిన పెట్టుబడి కేవలం 1,431 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఫ్యూచర్ గ్రూప్ ఆస్తులు రూ .30,000 కోట్లకు పైగా విలువైనవి కావడం గమనార్హం. అంత విలువైన ఆస్తులను అమెజాన్ కారుచవక రేటుకే కొట్టేయాలని చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

news18-telugu
Updated: November 17, 2020, 5:10 PM IST
Amazon చేస్తున్న కుట్ర ఇదే...రూ.1431 కోట్లతో రూ.30 వేల వ్యాపారం ఆక్రమించుకోవాలని ప్లాన్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
మల్టీనేషనల్ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఫ్యూచర్ రిటైల్‌ కంపెనీని 100 శాతం కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు, కిషోర్ బియాని గ్రూపులోని ఫ్యూచర్ రిటైల్ లోని మెజారిటీ ఈక్విటీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అంటే రూ .1,431 కోట్ల పెట్టుబడితో  రూ.30,000 కోట్ల విలువైన ఫ్యూచర్ గ్రూప్ ఆస్తులను నియంత్రించడానికి అమెజాన్ ప్రయత్నిస్తుందనే విమర్శలు వాణిజ్య వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

అమెజాన్ ఇప్పటి వరకూ ఎఫ్‌సిఎల్‌లో పెట్టిన పెట్టుబడి కేవలం 1,431 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఫ్యూచర్ గ్రూప్ ఆస్తులు (రిటైల్ & హోల్‌సేల్ ట్రేడ్, లాజిస్టిక్స్, గిడ్డంగులు, ఎఫ్‌ఎంసిజి, ఔట్‌సోర్సింగ్ వ్యాపారాలతో సహా) రూ .30,000 కోట్లకు పైగా విలువైనవి కావడం గమనార్హం. అంత విలువైన ఆస్తులను అమెజాన్ కారుచవక రేటుకే కొట్టేయాలని చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే CAIT అమెజాన్ సంస్థలు మరో ఈస్టిండియా కంపెనీ అని విమర్శించింది. ఫ్యూచర్ కూపన్స్ ప్రయివేట్ లిమిటెడ్ లో అమెజాన్‌కు 49 శాతం వాటా ఉంది. 2019లో దాదాపు రూ.1431 కోట్లను దీనిని కొనుగోలు చేసింది. దీన్ని అడ్డం పెట్టుకొని అమెజాన్ అనైతిక వ్యాపారానికి తెర లేపిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఫ్యూచర్ గ్రూప్‌లో సుమారు 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫ్యూచర్ గ్రూప్ ఇప్పటికే పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నుంచి 18,000 కోట్ల రూపాయలకు పైగా రుణ బకాయిలను పొందాల్సి ఉంది. అంతేకాదు  ఫ్యూచర్ గ్రూప్ ఖాతాల నుండి చెల్లించని బిల్లుల కోసం సరఫరాదారులు మరియు విక్రేతలు 7,500 కోట్ల రూపాయల వరకూ ఉన్నాయి.

లాక్డౌన్కు ముందే, కోవిడ్ 19 కారణంగా, ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారం నష్టాలను చవిచూసింది. ముఖ్యంగా రిటైల్ అమ్మకాలు / ఆదాయాలు తగ్గిపోవడం వల్ల మార్చి-2020 లో లాక్‌డౌన్ ప్రారంభమైన తరువాత, పరిస్థితి మరింత దిగజారింది.

దీని ఫలితంగా ఫ్యూచర్ గ్రూప్ ఆర్థిక సంస్థలు మరియు రుణదాతలు, విక్రేతలు, సరఫరాదారులకు, చెల్లించాల్సిన రుణాలు, బిల్లులు, లీజు అద్దెలకు సంబంధించి సుమారు 10,000 కోట్ల రూపాయలు చెల్లించడంలో విఫలమైంది.

అదనంగా, ఉద్యోగులకు జీతాలు మరియు ప్రోత్సాహకాలు చెల్లించడంలో తగ్గింపుతో పాటు ఆలస్యం కూడా జరుగుతోంది. ఈ సంక్షోభం రోజు రోజుకి విపరీతంగా పెరుగుతోంది, మరియు ఇది ఇప్పటి వరకు కొనసాగుతుంది మరియు ఫ్యూచర్ గ్రూప్ యొక్క ఆస్తుల విలువ యొక్క క్షీణిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెజాన్‌ ఫ్యూచర్ గ్రూపుతో చర్చల్లో ప్రారంభంచింది. కానీ కంపెనీ సంక్షోభాన్ని నివారించడానికి ఎటువంటి ఆచరణీయమైన ఎంపికతో ముందుకు రాలేదు. ఈ మరోవైపు ఫ్యూచర్ గ్రూప్ భాగస్వామ్యం రిలయన్స్ రిటైల్ తో చర్చల్లో నిమగ్నమై ఉంది. ఈ చర్చల గురించి అమెజాన్‌కు కూడా తెలుసు. మరోవైపు ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్ వ్యాపారాన్ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(RRVL)కు రూ.24,713 కోట్లకు విక్రయిస్తున్న సంగతి పలు వేదికల ద్వారా ప్రచారంలోకి వచ్చింది. ఈ సంగతిని రిలయన్స్ గ్రూపు అమెజాన్ కు తెలిపింది. అయినప్పటికీ అమెజాన్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. దీనిపై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ సానుకూలంగా స్పందించింది. ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అమెజాన్ వ్యవహరిస్తున్న తీరు వ్యాపార సూత్రాలకు వ్యతిరేకంగా ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Published by: Krishna Adithya
First published: November 17, 2020, 5:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading