ఈ దీపావళికి Amazonలో షాపింగ్ పండగ...సగం ధరకే కొత్త AC, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్...వామ్మో..

ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం Amazon గ్రేట్ ఇండియన్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు పలు రకాల గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అంతేకాక, వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఆయా బ్యాంకులతో చేసే చెల్లింపులపై అదనపు తగ్గింపు లభిస్తుంది.

news18-telugu
Updated: November 9, 2020, 7:18 PM IST
ఈ దీపావళికి Amazonలో షాపింగ్ పండగ...సగం ధరకే కొత్త AC, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్...వామ్మో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో పండుగ సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం Amazon గ్రేట్ ఇండియన్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు పలు రకాల గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అంతేకాక, వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఆయా బ్యాంకులతో చేసే చెల్లింపులపై అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ పండుగ సీజన్లో ప్రకటించిన ఆఫర్లలో భాగంగా వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి గృహోపకరణాలపై Amazonప్రకటించిన డిస్కౌంట్లపై ఓ లుక్కేద్దాం.హైయర్ 565 ఎల్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్-బై-సైడ్ Refrigirator

హైయర్ కంపెనీ నుండి ప్రీమియం రేంజ్లో అందుబాటులో ఉన్న 565 ఎల్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్-బై-సైడ్ Refrigirator కొనుగోలుపై 50 శాతం అనగా రూ .52,010 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రూ.1,05,000లుగా ఉన్న హైయర్ 565 ఎల్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ను 52,990 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.

Amazon బేసిక్స్ 564 ఎల్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్-బై-సైడ్ Refrigirator

Amazon బేసిక్స్ నుండి అందుబాటులో ఉన్న 564 ఎల్ ఫ్రాస్ట్ ఫ్రీ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్పై 45 శాతం అనగా రూ .34,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ పండుగ ఆఫర్లలో భాగంగా మీరు దీన్ని Amazonసైట్లో రూ .40,999లకే  కొనుగోలు చేయవచ్చు.Samsung 700 ఎల్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్- బై -సైడ్ Refrigirator

Samsung నుండి అందుబాటులో ఉన్న 700 ఎల్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్- బై -సైడ్ రిఫ్రిజిరేటర్పై 25 శాతం అనగా రూ.22,100 డిస్కౌంట్ లభిస్తుంది. పండుగ ఆఫర్లలో భాగంగా దీన్ని రూ.67,490లకే కొనుగోలు చేయవచ్చు.

LG 668 L InstaView డోర్-ఇన్-డోర్ ఇన్వర్టర్ లీనియర్ సైడ్-బై-సైడ్ Refrigirator

LGకంపెనీ నుండి అందుబాటులో ఉన్న ఎల్ ఇన్స్టా వ్యూ డోర్ ఇన్ డోర్ ఇన్వర్టర్ లీనియర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్పై 25‌‌ శాతం అనగా రూ. 49,300 డిస్కౌంట్ లభిస్తుంది. పండుగ ఆఫర్లలో భాగంగా దీన్ని  మీరు రూ.1,44,990 లకే కొనుగోలు చేయవచ్చు.పానాసోనిక్ 1.5 టన్ను 5 స్టార్ వై-ఫై ట్విన్ కూల్ ఇన్వర్టర్ Split AC

పానాసోనిక్ కంపెనీకి చెందిన 1.5 టన్ను 5 స్టార్ వై-ఫై ట్విన్ కూల్ ఇన్వర్టర్ Split ACపై 27 శాతం అనగా రూ.14,510 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. పండుగ ఆఫర్లలో భాగంగా మీరు దీన్ని రూ.39,990లకే కొనుగోలు చేయవచ్చు.

క్యారియర్ 1.5 టన్ను 5 స్టార్ ఇన్వర్టర్ Split AC

క్యారియర్ నుండి అందుబాటులో ఉన్న 1.5 టన్ను 5 స్టార్ ఇన్వర్టర్ Split ACపై 38 శాతం అనగా రూ .22,991 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ .59,990గా ఉన్న ఈ ఏసీని పండుగ ఆఫర్లో భాగంగా రూ .36,999లకే కొనుగోలు చేయవచ్చు.

LG 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ Split AC

పండుగ ఆఫర్లలో భాగంగా అమెజాన్లో LG1.5 టన్ను 5 స్టార్ ఇన్వర్టర్ Split ACపై 34 శాతం అనగా రూ .19,950 డిస్కౌంట్ లభిస్తుంది. Amazon సైట్లో దీన్ని మీరు రూ .39,490లకే కొనుగోలు చేయవచ్చు.Samsung 6.0 కిలోల ఇన్వర్టర్ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ Washing Machine

Samsung కంపెనీకి చెందిన 6.0 కిలోల ఇన్వర్టర్ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్పై 22 శాతం అనగా రూ .5,910 డిస్కౌంట్ లభిస్తుంది. దీన్ని మీరు రూ .20,990లకే కొనుగోలు చేయవచ్చు.

గోద్రేజ్ 6.2 కిలోలు పూర్తిగా ఆటోమేటిక్ టాప్ లోడింగ్ Washing Machine

గోద్రేజ్ కంపెనీకి చెందిన 6.2 కిలోల ఫుల్ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్పై 39 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ పండుగ ఆఫర్లలో భాగంగా రూ .10,990లకే దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Amazon బేసిక్స్ 6 కిలోల ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ Washing Machine

Amazon బేసిక్స్ కు  చెందిన రూ. 32,000గా ఉన్న 6 కిలోల ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ను పండుగ ఆఫర్లలో భాగంగా రూ.14,499లకే కొనుగోలు చేయవచ్చు.
Published by: Krishna Adithya
First published: November 9, 2020, 7:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading