కరోనాతో షాపింగ్ చేయలేకపోతున్నారా...Amazonలో రూ.2500 చీర కేవలం రూ.300కే లభ్యం..మహిళలకు పండగే

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ .3000 విలువైన చీరలను కేవలం రూ .600 కే లభించనున్నాయి. అంటే ఏకంగా రూ .2400 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

news18-telugu
Updated: October 21, 2020, 8:15 PM IST
కరోనాతో షాపింగ్ చేయలేకపోతున్నారా...Amazonలో రూ.2500 చీర కేవలం రూ.300కే లభ్యం..మహిళలకు పండగే
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పండుగ సీజన్‌లో షాపింగ్ చేయడం అంటే మహిళలకు చాలా ఇష్టం అనే చెప్పాలి. అయితే కరోనా కాలంలో షాపింగ్ చేయాలంటే చాలా కష్టంగా మారింది. దీంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు ఈ అవకాశాన్ని మరింత అద్భుతంగా మార్చేశాయి. ఈ ప్రత్యేక సీజన్లో ఈ కంపెనీలు అన్ని రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. ఈ ఆఫర్ సేల్‌లో  మొబైల్, గృహోపకరణాలు, వాచీలతో పాటు దుస్తులపై కూడా మంచి ఆపర్స్ అందుబాటులోకి తెచ్చింది. అయితే మహిళలు తమకు ఇష్టమైన చీరల కోసం చూస్తున్నట్లయితే అవి గొప్ప డిస్కౌంట్లలో కూడా లభిస్తాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ .3000 విలువైన చీరలను కేవలం రూ .600 కే లభించనున్నాయి. అంటే ఏకంగా రూ .2400 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

అలాగే రూ. 2500 విలువైన అన్నీ డిజైనర్ ఉమెన్స్ ఆర్ట్ సిల్క్ చీరలు  వేలు కేవలం రూ.300కే లభిస్తున్నాయి. అంటే, మీకు ఈ చీరలు 85 శాతం తగ్గింపుతో లభిస్తుంది. చీర పొడవు 5.5 మీటర్లుగా కాగా,  ఈ చీర ఫాబ్రిక్ ఆర్ట్ పట్టుతో కూడినది. అదేవిధంగా, రూ .2599 ఖరీదు చేసే ప్రింటెడ్ చీరను కూడా 328 రూపాయలకే లభిస్తోంది. ఈ చీరలపై ఆఫర్ అక్టోబర్ 25 ఆదివారం వరకు ఉంటుంది.

90 శాతం తగ్గింపుతో రూ. 2599 విలువైన చీర
అమెజాన్ ఆఫర్లలో చీరలపై 90% వరకు తగ్గింపు ఇస్తున్నారు. వాటిలో ఒకటి కాటన్ సిల్క్ చీరపై 90% తగ్గింపును పొందవచ్చు. మీరు రూ. 2599 రూపాయల చీరను  కేవలం 259 రూపాయలకే కొనవచ్చు. ఈ చీర పొడవు కూడా 5.5 మీటర్లు. ఇది కాకుండా, కలాంకారి సిల్క్ ప్రింటెడ్ చీరపై మీకు 87 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ చీరను రూ .399 కొనుగోలు చేయవచ్చు. వీటి ధర రూ.2599 పలుకుతోంది.

బనారసి చీరపై 75% తగ్గింపు
బనారసి ఆర్ట్ సిల్క్ చీరలో మీకు 75% తగ్గింపు లభిస్తుంది. ఈ చీర ధర రూ .4999 అయినప్పటికీ, డిస్కౌంట్‌తో మీరు ఈ చీరను రూ .1268 కు పొందవచ్చు. ఈ చీర పొడవు 5.30 మీటర్లు. బనారసి సిల్క్ కాటన్ చీరలు కూడా 87% తగ్గింపు పొందవచ్చు. ఈ చీరను 4299 రూపాయల విలువైన చీరను కేవలం 629 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంది.

రంగు ఎంపికలు చాలా ఉన్నాయిఈ చీరలన్నింటిలో మీకు చాలా కలర్ ఆప్షన్స్ వస్తాయి. ఇది మాత్రమే కాదు, 30 రోజుల రిటర్న్స్,  ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. మీకు ఏమైనా సందేహాలంటే, మీరు అమెజాన్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా నేరుగా అడగవచ్చు. వివిధ బ్యాంకుల డెబిట్-క్రెడిట్ కార్డులను ఉపయోగించడంపై డిస్కౌంట్ కూడా ఉంది.
Published by: Krishna Adithya
First published: October 21, 2020, 8:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading