Home /News /business /

AMAZON PRIME DAY SALE 2022 STARTING FROM JULY 23RD TO 24 FULL OFFERS UMG GH

Amazon Prime Day Sale 2022: అమెజాన్ డిస్కౌంట్ల వర్షం.. ఆ ఒక్క రోజు కళ్లు చెదిరే ఆఫర్స్.. ఇలా చేస్తే తక్కువ ధరకు పొందొచ్చు..!

అమెజాన్ ప్రైమ్ డే సేల్

అమెజాన్ ప్రైమ్ డే సేల్

క్రిస్మస్‌ సంబరాలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే ముందుగానే షాపింగ్‌ (Shopping) ఫీవర్‌ను అందించడానికి అమెజాన్‌ (Amazon) సిద్దమైంది. అమెజాన్ ప్రైమ్ డే (Amazon Prime Day) అనేది ప్రైమ్ మెంబర్‌లకు ప్రత్యేకమైన రోజు. ఇది మొదటిసారిగా 2015లో అమెజాన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా మొదలైంది.

ఇంకా చదవండి ...
క్రిస్మస్‌ సంబరాలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే ముందుగానే షాపింగ్‌ (Shopping) ఫీవర్‌ను అందించడానికి అమెజాన్‌ (Amazon) సిద్దమైంది. అమెజాన్ ప్రైమ్ డే (Amazon Prime Day) అనేది ప్రైమ్ మెంబర్‌లకు ప్రత్యేకమైన రోజు. ఇది మొదటిసారిగా 2015లో అమెజాన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా మొదలైంది. ఈ సేల్ డే భారీగా విజయవంతం అవడంతో అమెజాన్ దీనిని వార్షిక విక్రయాల ఈవెంట్‌గా మార్చింది. ఈ సేల్‌ప్రైమ్ మెంబర్‌లకు మాత్రమే ప్రత్యేకమైనది. భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ సేల్ జులై 23న ప్రారంభమవుతుంది, జులై 24 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌ తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమవుతుంది.. 48 గంటల పాటు కొనసాగుతుంది. ప్రైమ్ డేని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నిర్వహిస్తారు. ప్రైమ్ డే సేల్ 2022 యూఎస్‌, బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ, కెనడా, స్పెయిన్, యూకే, పోలాండ్, ఇటలీ, స్వీడన్, ఆస్ట్రియా, మెక్సికో, ఆస్ట్రేలియా, పోర్చుగల్, బ్రెజిల్, ఫ్రాన్స్‌లోని ప్రైమ్ మెంబర్‌ల కోసం జులై 12 నుంచి జూలై 13 వరకు జరుగుతుంది. భారతదేశంలో నిర్వహించే తేదీలలోనే చైనా, జపాన్, నెదర్లాండ్స్, సింగపూర్‌, సౌదీ అరేబియా, ఈజిప్ట్ మొదలైన దేశాలలో సేల్‌ జరుగుతుంది.

* అమెజాన్ ప్రైమ్ డే 2022కి ఎలా సిద్ధం కావాలి
అమెజాన్ ప్రైమ్ డే 2022 ప్రయోజనాలను ఆస్వాదించడానికి, ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఉండాలి. దాని కోసం అమెజాన్ ప్రైమ్‌కు సైన్ అప్ చేసుకోవాలి.

* అమెజాన్ ప్రైమ్ కోసం సైన్ అప్ చేయడం ఎలా?
ప్రైమ్ వినియోగదారులకు అందించే ప్రయోజనాలను ఆస్వాదించాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందడం ముఖ్యం. సైన్ అప్ చేయడానికి ఇలా చేయాలి..
- మొదట https://www.amazon.com వెబ్‌సైట్‌ను ఓపన్‌ చేయాలి.
- అకౌంట్స్‌ సెక్షన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
- తర్వాత అమెజాన్ అకౌంట్‌కు సైన్ ఇన్ చేయాలి.
- సైన్అప్ బటన్‌ను క్లిక్‌ చేయాలి.
- సూచనలను అనుసరించి పేమెంట్‌ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోవాలి.
- పేమెంట్‌ పూర్తయిన తర్వాత ప్రైమ్‌ మెంబర్‌ అవుతారు.

ఇదీ చదవండి: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా..? అయితే, మీరు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!


* అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022లో అద్భుతమైన డీల్‌లు
* అమెజాన్ ఫైర్ టీవీ క్యూబ్(Amazon Fire TV Cube)
అమెజాన్‌ పవర్‌ఫుల్‌ ఫైర్‌ టీవీ మీడియా ప్లేయర్‌ని అందజేస్తుంది. ఇది ఆకర్షణీయమైన 4K స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. HDR, HDR10+, Dolby Vision, Dolby Atmos ఆడియోకి స్ట్రీమింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. రిమోట్‌ అవసరం లేకుండా వాయిస్ కమాండ్స్‌ను రిసీవ్‌ చేసుకుంటుంది. A/V రిసీవర్‌లతో పాటు అనుకూల సౌండ్‌బార్‌ కూడా ఉంటుంది. ఇది అలెక్సా వాయిస్ రిమోట్, ఈథర్నెట్ అడాప్టర్, పవర్ అడాప్టర్ మరియు IR ఎక్స్‌టెండర్ కేబుల్‌తో వస్తుంది. దీని ధర 59.99 డాలర్‌లుగా ఉంది.

* అమెజాన్ హాలో బ్యాండ్(Amazon Halo Band)
అమెజాన్ హాలో బ్యాండ్ హృదయ స్పందన రేటు, స్లీపింగ్‌ హవర్స్‌, స్టెప్స్‌, నిద్ర ట్రాకింగ్ వంటి ఫీచర్‌లతో వస్తుంది. బ్యాండ్ 50M వరకు వాటర్‌ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. దీన్ని ఈత కొట్టేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు. బాడీ ఫ్యాట్‌, బరువు లేదా BMI వరకు, ఈ డివైజ్‌ అన్నింటిలో సహాయపడుతుంది. ఈ బ్యాండ్ ఆకట్టుకునే ఫీచర్‌ ఏమిటంటే, సమాచారాన్ని మరెవరూ చూడనివ్వకుండా ఎప్పుడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, డేటాను తొలగించవచ్చు. దీని ధర 44.98 డాలర్‌లుగా ఉంది.

* ఎకో డాట్ (ఫోర్త్‌ జనరేషన్‌) కిడ్స్‌+ ఎకో గ్లో (Echo Dot (4th Gen) Kids + Echo Glow )
చిన్నారులకు ఎకో డాట్ ఫోర్త్ జనరేషన్‌ కిడ్స్‌ ప్లస్‌ ఎకో గ్లో డివైజ్‌ను ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయవచ్చు. ఇది అలెక్సా యాప్‌కి కూడా కనెక్ట్ అవుతుంది. Amazon Kids+ సబ్‌స్క్రిప్షన్‌తో ఉపయోగించవచ్చు. డివైజ్‌ను ఎకో గ్లో మల్టీకలర్ స్మార్ట్ ల్యాంప్‌తో యాడ్‌ చేయవచ్చు. ఎకో గ్లో ల్యాంప్ అనేది పిల్లల కోసం ఆహ్లాదకరమైన సమయాన్ని సృష్టిస్తుంది. అది వెలుగుతున్నప్పుడు, పిల్లలు వినోదభరితంగా, చురుకుగా ఉంటారు. హోంవర్క్‌లో సహాయం పొందడంలో, ఆడియోబుక్‌లు, గేమ్‌లు, ఇతర కార్యకలాపాలకు యాక్సెస్‌ని పొందడంలో సహాయపడుతుంది. ఎకో డాట్ కిడ్స్ మైక్రోఫోన్ ఆఫ్ బటన్‌తో పాటు మల్టిపుల్‌ ప్రైవసీ ఫీచర్‌లతో వస్తుంది. దీని ధర 35.99 డాలర్‌లుగా ఉంది.

* ఫైర్ 7 కిడ్స్ ప్రో టాబ్లెట్(Fire 7 Kids Pro Tablet)
ఫైర్ 7 కిడ్స్ ప్రో టాబ్లెట్ అనేది 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం తయారు చేశారు. 7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది అమెజాన్‌ కిడ్స్+ ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరాలు, మైక్రో USB పోర్ట్, 512 GB స్టోరేజ్‌ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. యాప్‌లు, ఇ-బుక్స్, గేమ్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ఉపయోగించవచ్చు. పిల్లలు టాబ్లెట్‌ను వినియోగించడాన్ని తల్లిదండ్రులు నియంత్రించవచ్చు. ఈ టాబ్లెట్‌తో 2 సంవత్సరాల గ్యారెంటీతో పాటు స్లిమ్ కేస్‌ను పొందే అవకాశం ఉంది. దీని ధర 49.99 డాలర్‌లుగా ఉంది.* ఎకో(ఫోర్త్‌ జనరేషన్‌) బండిల్‌ విత్‌ మేడ్ ఫర్ అమెజాన్‌ మౌంట్‌ ఎకో(Echo (4th Gen) bundle with"Made for Amazon" Mount for Echo)
రాబోయే అమెజాన్ డీల్‌లో దీని ధర తగ్గనుంది. ఇది బిల్ట్‌ఇన్‌ హబ్‌లు, లాక్‌లు, సెన్సార్‌లతో పాటు స్మార్ట్ లైటింగ్, సోలార్ లైట్లు, కంట్రోల్ కోసం వాయిస్ కంట్రోల్ బల్బులతో వస్తుంది. ఇది వినోదం కోసం వాయిస్ కంట్రోల్‌, అలెక్సాతో కనెక్షన్, అలారాలను సెటప్ చేయడం, ఇంట్లో ఉన్న ఇతర స్మార్ట్ పరికరాలకు సపోర్ట్‌ చేయడం వంటి ఫీచర్‌లను అందిస్తుంది. దీన్ని గోడపై కూడా ఉంచవచ్చు. ఆహ్లాదకరమైన ఆడియో అనుభవం కోసం ఏదైనా గదికి అనుకూలించే అధిక, డైనమిక్, లోతైన బాస్‌ను అందించడానికి ఈ డివైజ్‌ను రూపొందించారు. దీని ధర 121.98 డాలర్‌లుగా ఉంది.

* ఎకో ఫ్రేమ్‌లు (సెకండ్‌ జనరేషన్‌)(Echo Frames(2nd Gen))
సౌకర్యం , సౌలభ్యం విషయానికి వస్తే ఎకో ఫ్రేమ్‌లు బెస్ట్‌ ఆప్షన్‌. ఈ ఫ్రేమ్‌లు IPX4 స్ప్లాష్-రెసిస్టెంట్, ఓపెన్-ఇయర్ ఆడియోతో వస్తాయి. అలెక్సాతో కనెక్ట్‌ కావచ్చు. రోజుకు 14 గంటల పాటు మీడియా ప్లేబ్యాక్‌ను ఆస్వాదించవచ్చు. బ్యాటరీ లైఫ్ 2 గంటల టాక్ టైమ్, 4 గంటల నాన్‌స్టాప్ లిజనింగ్ అందిస్తుంది. సిరి, గూగుల్‌ అసిస్టెంట్‌కి యాక్సెస్‌ ఉంటుంది. దీని ధర 249.999 డాలర్‌లుగా ఉంది.

* ఆల్-న్యూ తోషిబా 55-అంగుళాల క్లాస్ M550 సిరీస్ స్మార్ట్ ఫైర్ టీవీ(All-New Toshiba 55-inch Class M550 Series Smart Fire TV)
ఆల్-న్యూ తోషిబా 55-అంగుళాల క్లాస్ M550 సిరీస్ స్మార్ట్‌ ఫైర్‌ టీవీ గృహాలకు గొప్ప వినోదం అందించే డివైజ్‌. టీవీ అలెక్సాకు వాయిస్ యాక్సెస్‌ని అందిస్తుంది. ఈ టీవీకి చాలా ఆఫర్లు ఉన్నాయి. ఆటో తక్కువ లేటెన్సీ గేమ్ మోడ్‌లో గేమ్‌లను ఆస్వాదించవచ్చు. డాల్బీ విజన్ HDR, HDR10+తో కూడిన 4K UHD స్మార్ట్ ఫైర్ టీవీ బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Amazon, Amazon prime, Amazon sales, Discounts

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు