ప్రముఖ ఈ-కామర్స్(E-Commerce) దిగ్గజం అమెజాన్ పే(Amazon pay) వినియోగదారులకు కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. అమెజాన్ పే తన చెల్లింపు యాప్ కువేరా.ఇన్ తో జత చేసినట్లు సంస్థ ప్రకటించింది. దీనిద్వారా ఇకపై అమెజాన్ పే ద్వారా ఎఫ్‌డీలు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయొచ్చని సంస్థ ప్రకటించింది. అమెజాన్ పే అనేది అమెజాన్‌కు చెందిని ఆన్‌లైన్(Online) పేమెంట్ సేవ. ఇది 2007లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థ కువేరా.ఇన్‌తో జత కలిసింది. దీని ద్వారా కస్టమర్ల నుంచి ఎఫ్‌డీలు స్వీకరించేలా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్‌లోకూడా పెట్టుబడి పెట్టేలా ఏర్పాటు చేశారు.
అమెజాన్ పే(Amazon Pay) లాగానే.. గూగుల్ పే(Google Pay) కూడా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో కలిసి తన వినియోగదారులకు డిపాజిట్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతించింది. అయితే, అమెజాన్ పెట్టుబడులకు సంబంధించి మరింత స్పష్టత రావాల్సి ఉంది.
"మేము పెట్టుబడిదారుల కోసం అమెజాన్‌లో అత్యంత సులభతరమైన ఫీచర్ ప్లాట్ ఫాంను నిర్మించాం. అమెజాన్ పే ఇండియాతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మరింత బాగా ఇండియాలో ఈ కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాం అని కువెరా.ఇన్(Kuvera.in) వ్యవస్థాపకుడు మరియు CEO గౌరవ్ రస్తోగి చెప్పారు.
ప్రస్తుతం అమెజానకు 600 మిలియన్ వినియోగదారులు ఉన్నారు. అయితే ఇండియా లాంటి దేశాల్లో 30 40 మిలియన్ వినియోగదారులు మాత్రమే నాణ్యమైన పెట్టుబడి పెట్టగలరని అంచనా కువేరా అనేది సెబీ(SEBI) రిజిస్టర్ కంపెనీ. ప్రస్తుతం పెట్టుబడులు, రుణాల రూపంలో ఈ సంస్థ రూ. 28,000 కోట్ల ఆస్తులు కలిగి ఉంది.
ప్రతీ భారతీయుడికి ఆర్థిక చెల్లింపులు సులభతరం చేయడంతోపాటు పెట్టుబడి విధానాలను సరళీకరించి ప్రజలను ఆర్థికంగా ఎదిగేలా చేయడంఏ లక్ష్యమని అమెజాన్ పే ఇండియా డైరెక్టర్ వికాస్ బన్సాల్ పేర్కొన్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ కొత్త తరహా పెట్టుబడుల అవకాశౄలను ఆర్బీఐ పెద్ద పీట వేస్తుందో లేదు చూడాలని ఆర్థిక నిపుణులు ఏపేర్కొంటున్నారు. అమెజాన్‌పే కువేరా ద్వారా సేవింగ్, ఉత్పత్తి పెట్టుబడులు పెట్టే అవకాశం వినియోగదారులకు మెరుగ్గా ఉంటుందని ఫిడేలిటీ ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ అలోకిక్ అద్వానీ అభిప్రాయపడ్డారు.
కొద్ది రోజుల క్రితం గూగుల్ పే, ఈక్విటాస్ స్మాల్ ఫైనాస్స్ బ్యాకర్లతో కలిసి పెట్టుబడుల ఆహ్వానించిన విషయం తెలిసింది. ఇలాంటి భాగస్వామ్యాలు బ్యాంకింగ్ వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకొచ్చేఅవకాశం ఉందంటున్నారు నఆర్థిక వేత్తలు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AMAZON PAY, Google pay