అమెజాన్ యూజర్లకు శుభవార్త. ఇక మీరు మీ అమెజాన్ అకౌంట్లో బంగారం కొనొచ్చు. అవును... అమెజాన్ పే ద్వారా డిజిటల్ గోల్డ్ కొనే అవకాశం కల్పిస్తోంది అమెజాన్ ఇండియా. కొత్తగా ప్రారంభించిన సర్వీస్ ఇది. కేవలం రూ.5 నుంచి మీరు బంగారం కొనొచ్చు. ఇందుకోసం సేఫ్గోల్డ్ అనే సంస్థతో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్‌కు ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే అమెజాన్ పే ప్లాట్‌ఫామ్ ఉన్న సంగతి తెలిసిందే. అందులోనే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫీచర్‌ను 'గోల్డ్ వాల్ట్' పేరుతో ప్రారంభించింది. ఇందులో మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కొద్దికొద్దిగా డిజిటల్ గోల్డ్ కొని దాచుకోవచ్చు. రూ.5 నుంచే మీ సేవింగ్స్ మొదలుపెట్టొచ్చు.
ఇప్పటికే పేటీఎం గోల్డ్ కూడా ఇలాంటి సర్వీస్ అందిస్తోంది. పేటీఎంతో పాటు గూగుల్‌పే, ఫోన్‌పే, మొబీక్విక్, యాక్సిస్ బ్యాంకుకు చెందిన ఫ్రీఛార్జ్ లాంటి ఇతర డిజిటల్ పేమెంట్ సంస్థలు కూడా డిజిటల్ గోల్డ్ అమ్ముతున్నాయి. పేటీఎం, ఫోన్‌పే 2017లోనే తమ ప్లాట్‌ఫామ్స్ ద్వారా డిజిటల్ గోల్డ్ అమ్ముతుండగా, మొబీక్విక్ 2018లో ఈ సర్వీస్ ప్రారంభించింది. గూగుల్‌పే గతేడాది డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని తమ కస్టమర్లకు అందించింది. ఇక ఈ ఏడాది చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన షావోమీ కూడా ఎంఐపే ద్వారా డిజిటల్ గోల్డ్ అమ్మకాలు మొదలుపెట్టింది. ఇప్పుడు వాటన్నింటికీ పోటీగా అమెజాన్ పే వచ్చింది.
అమెజాన్ పేలో మీరు బంగారం కొనడం మాత్రమే కాదు... మీకు కావాల్సినప్పుడు గోల్డ్ అమ్మొచ్చు. ఫిజికల్ గోల్డ్ కొంటే దాచుకోవడం కష్టం. అందుకే ఇటీవల డిజిటల్ గోల్డ్‌కి డిమాండ్ పెరిగింది. అక్షయ తృతీయ లాంటి పర్వదినాల సమయంలో డిజిటల్ గోల్డ్ అమ్మకాలు భారీగానే ఉంటున్నాయి. గత అక్షయ తృతీయ సీజన్లో పేటీఎం ఏకంగా 37 కిలోల డిజిటల్ గోల్డ్ అమ్మడం విశేషం. ఫోన్‌పే అయితే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో 100 కిలోల డిజిటల్ గోల్డ్ అమ్మింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.