అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఇండిపెండెన్స్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ ఆగస్ట్ 10న ముగుస్తుంది. రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ (Reliance Digital India Sale) కూడా ఆగస్ట్ 6న ప్రారంభం కానుంది. మీరు కూడా ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) చేయాలనుకుంటున్నారా? ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సిటీబ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్ నుంచి ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి ప్రత్యేకంగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డులతో డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్, రివార్డ్స్ పొందొచ్చు. మరి ఏ బ్యాంకు నుంచి ఎలాంటి క్రెడిట్ కార్డులు ఉన్నాయి? యాన్యువల్ ఫీజు ఎంత? లభించే బెనిఫిట్స్ ఏంటీ? తెలుసుకోండి.
Amazon Pay ICICI Credit Card: అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ తీసుకున్నవారికి అమెజాన్‌లో అనేక బెనిఫిట్స్ లభిస్తాయి. ప్రైమ్ మెంబర్స్‌కి 5 శాతం, నాన్ ప్రైమ్ మెంబర్స్‌కు 3 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 100 పైగా అమెజాన్ పార్ట్‌నర్ మర్చంట్స్ దగ్గర ఈ కార్డు ఉపయోగిస్తే 2 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రివార్డ్స్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. ఇది లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డు.
Credit Card: ఇక క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించే తేదీని మీరే నిర్ణయించుకోవచ్చు
SBI Simplyclick card: ఎస్‌బీఐ సింప్లీక్లిక్ కార్డు తీసుకుంటే మొదట రూ.500 అమెజాన్ గిఫ్ట్ కార్డ్ లభిస్తుంది. అమెజాన్, క్లియర్‌ట్రిప్, బుక్‌మైషో, లెన్స్‌కార్ట్ సహా పార్ట్‌నర్స్ నుంచి 10 రెట్లు రివార్డ్స్ లభిస్తాయి. ఆన్‌లైన్‌లో ఉపయోగిస్తే ఐదు రెట్లు రివార్డ్స్ లభిస్తాయి. ఏటా రూ.1,00,000 పైన ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తే రూ.2,000 ఇవోచర్ లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు రూ.499. ఏటా రూ.1,00,000 పైన ఖర్చు చేస్తే యాన్యువల్ ఫీజు మినహాయింపు లభిస్తుంది.
Flipkart Axis Bank Credit Card: ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర మర్చంట్స్ దగ్గర షాపింగ్ చేస్తే 4 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర కేటగిరీల్లో షాపింగ్ చేస్తే 1.5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. యాక్టివేషన్ సమయంలో రూ.1,000 విలువైన వెల్‌కమ్ బెనిఫిట్స్ లభిస్తాయి. యాన్యువల్ ఫీజు రూ.500.
HSBC Cashback Credit Card: హెచ్ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఆన్‌లైన్‌లో చేసే లావాదేవీలపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అమెజాన్‌లో రూ.1,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా నెలకు రూ.250 డిస్కౌంట్ పొందొచ్చు. రూ.500 విలువైన అమెజాన్ వోచర్, రూ.1,500 విలువైన మింత్రా వోచర్, రూ.3,000 విలువైన ఆజియో వోచర్లు వెల్‌కమ్ బెనిఫిట్స్‌గా లభిస్తాయి. యాన్యువల్ ఫీజు రూ.750.
Post Office Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.16.26 లక్షల రిటర్న్స్
HDFC Millenia Credit Card: హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్ కార్డుతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, టాటా క్లిక్‌లో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లో చేసే లావాదేవీలకు 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఒక క్యాలెండర్ క్వార్టర్‌లో రూ.1,00,000 లావాదేవీలు చేస్తే రూ.1,000 విలువైన వోచర్ లభిస్తుంది. యాన్యువల్ ఫీజు రూ.1000.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Credit cards, Flipkart, Personal Finance