Home /News /business /

AMAZON OFFERS FREE COURSE IN CLOUD COMPUTING AIMS AT TRAINING 29 MILLION PEOPLE MK GH

Cloud Computing: నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. క్లౌడ్ కంప్యూటింగ్​లో ఫ్రీ కోర్సు అందిస్తోన్న అమెజాన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

అమెజాన్ మరోసారి అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీ స్టార్ట్ ప్రోగ్రాంతో ముందుకొచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్ లో ఒక ఫుల్ టైం, క్లాస్ రూం బేస్డ్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్ మెంట్ కోర్స్ ని ప్రారంభించింది. ఈ కోర్సు చేయడానికి విద్యార్థులు టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.

ఇంకా చదవండి ...
అమెజాన్ మరోసారి అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీ స్టార్ట్ ప్రోగ్రాంతో ముందుకొచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్ లో ఒక ఫుల్ టైం, క్లాస్ రూం బేస్డ్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్ మెంట్ కోర్స్ ని ప్రారంభించింది. ఈ కోర్సు చేయడానికి విద్యార్థులు టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. ఈ కోర్సు ద్వారా టెక్నాలజీ సంబంధించిన అంశాలపైనే కాదు.. రెజ్యుమె రైటింగ్, ఇంటర్వ్యూలు అటెండ్ చేసే విధానం వంటి వాటిపై కూడా అవగాహన సాధిస్తారు. ఈ కార్యక్రమంలో డేటాబేస్ స్కిల్స్, లైనెక్స్, పైథాన్, సెక్యూరిటీ, నెట్ వర్కింగ్ వంటివన్నీ కూడా నేర్పుతారు. ఎంట్రీ లెవెల్ క్లౌడ్ పొజిషన్స్ కోసం అందరినీ సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అమెజాన్ సంస్థ వెల్లడిస్తోంది.

ఈ పన్నెండు వారాల అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రోగ్రాం విద్యార్థులను క్లౌడ్ కంప్యూటింగ్ లో ముఖ్యమైన అంశాలను నేర్పుతుంది. ఈ ప్రొఫెషనల్ కోర్సును 52 సిటీల్లో 25 దేశాల్లో అందించనుంది. ఈ కోర్సు పూర్తయ్యే లోపు ఆయా ఉద్యోగాలు అందిస్తున్న సంస్థలతో ఇంటర్వ్యూలు కూడా ఏర్పాటు చేసి క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో ఉద్యోగాలు కూడా సాధించేలా చేస్తుంది అమెజాన్ సంస్థ. ఈ కోర్సు చేయడానికి వయో పరిమితి లేదు. ఫీజు కూడా లేదు. క్లౌడ్ స్కిల్స్ ట్రైనింగ్ అందరికీ అందుబాటులో ఉంచేలా ఈ కోర్సును ప్రారంభించింది అమెజాన్. ఈ కోర్సు తర్వాత వివిధ సోషల్, కల్చరల్ బ్యాక్ గ్రౌండ్ లకు చెందిన వారిని రిక్రూటర్లు ఎంచుకునే అవకాశాలు పెరుగుతాయి. దీని ద్వారా వెనుకబడిన వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అమెజాన్ సంస్థ వెల్లడించింది.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీస్టార్ట్ ప్రోగ్రాం 2017 లో ప్రారంభమైంది. దీని మొదటి క్లాసులు లండన్ లో జరిగాయి. అప్పటి నుంచి ఈ ప్రోగ్రాం అందరికీ అందేలా చేయడానికి అమెజాన్ ప్రయత్నిస్తోంది. ఈ పన్నెండు వారాల కోర్సు ద్వారా బ్రాండ్ గ్లోబల్ కమిట్ మెంట్ అందిస్తూ 29 మిలియన్ల మందికి అందిస్తూ వారికి టెక్నికల్ స్కిల్స్ ని ఉచితంగా అందించనుంది. ప్రపంచంలో అన్నీ డిజిటల్ మీడియంపై ఆధారపడుతున్నప్పుడు ఈ కోర్సు ప్రారంభమవుతుండడం విశేషం. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకారం 84 శాతం ఎంప్లాయర్స్ ప్రస్తుతం డిజిటల్ వర్కింగ్ స్పేస్ లకే ప్రాధాన్యం ఇస్తున్నారట. అంతే కాదు.. వచ్చే ఐదు సంవత్సరాల్లో 50 శాతానికి పైగా ఉద్యోగులకు రీస్కిల్లింగ్ అవసరం అని కూడా ఇది తేల్చింది.
Published by:Krishna Adithya
First published:

Tags: AMAZON INDIA

తదుపరి వార్తలు