HOME »NEWS »BUSINESS »amazon mega salary days sale from january 1 here is all you want to know mk gh

Amazon Mega Salary Days: New year కోసం భారీ ఆఫర్లను ప్రకటించిన అమెజాన్

Amazon Mega Salary Days: New year కోసం భారీ ఆఫర్లను ప్రకటించిన అమెజాన్
ప్రతీకాత్మక చిత్రం

భారత వినియోగదారులకోసం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి బంపర్ ఆఫర్లతో సేల్స్‌ను ప్రకటించింది. కొత్త సంవత్సరం సందర్భంగా ‘మెగా శాలరీ డేస్’ (Mega Salary Days) పేరుతో ఆకట్టుకునే ఆఫర్లను ఇవ్వనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

  • Share this:
భారత వినియోగదారులకోసం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి బంపర్ ఆఫర్లతో సేల్స్‌ను ప్రకటించింది. కొత్త సంవత్సరం సందర్భంగా ‘మెగా శాలరీ డేస్’ (Mega Salary Days) పేరుతో ఆకట్టుకునే ఆఫర్లను ఇవ్వనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. చిన్న, పెద్ద గృహోపకరణాలు, టీవీలు, ఫర్నిచర్, స్పోర్ట్స్‌, ఆటో ఉత్పత్తులు, బొమ్మలు.. వంటివాటిపై భారీగా తగ్గింపులు ఉన్నాయి. ఈ ఆఫర్లు 2021 జనవరి 1 నుంచి జనవరి 3 వరకు అందుబాటులో ఉంటాయి. బ్రాండ్ల వారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా అమెజాన్‌ ప్లాట్‌ఫాంలో ఉత్పత్తులను కొనుగోలు చేసేవారికి పది శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ (రూ.1,250 వరకు) లభిస్తుంది. ఇతర ఈఎంఐ ఆప్షన్‌లపై కూడా కస్టమర్లకు పది శాతం డిస్కౌంట్‌ (రూ.1500 వరకు) లభిస్తుంది.

వాటిపై ఎక్కువ డిస్కౌంట్లు


న్యూ ఈయర్ సేల్స్‌లో ఇతర పోటీ ఈ- కామర్స్ సంస్థలకంటే అమెజాన్ ముందుంది. గతంలో దసరా, దీపావళి తరువాత అంత పెద్ద రేంజ్‌లో మెగా సేల్స్‌ను ఆ సంస్థ ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రకటించిన ‘మెగా శాలరీ డేస్’ సేల్స్ సందర్భంగా శామ్‌సంగ్, ఎల్‌జీ, వర్ల్‌పూల్, ఐఎఫ్‌బి, గోద్రేజ్... వంటి అతిపెద్ద బ్రాండ్లు, ఎక్కువ ధర ఉండే ఉత్పత్తులపై భారీగా తగ్గింపులు ఉన్నాయి. హోమ్‌టౌన్, కాయిర్‌ఫిట్, స్లీప్‌వెల్ వంటి కంపెనీల ఫర్నిచర్‌పై మంచి ఆఫర్లను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. బోట్, సోనీ, జేబీఎల్‌ సంస్థల హెడ్‌ఫోన్‌లు, ఇతర ఉత్పత్తులపైన కూడా మంచి ఆఫర్లు ఉన్నాయని అమెజాన్ తెలిపింది. పెద్ద ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి. బెస్ట్ సెల్లింగ్ వాషింగ్ మెషిన్లపై 35 శాతం, ఎయిర్ కండీషనర్లపై 35 శాతం వరకు తగ్గింపులను కస్టమర్లు పొందవచ్చు. దీంతో పాటు మైక్రోవేవ్‌లపై 40 శాతం, టీవీలపై 30 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి.
Published by:Krishna Adithya
First published:December 29, 2020, 18:43 IST