Job Cuts | ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఎంప్లాయీస్‌ను ఇంటికి పంపించాయి. ఇప్పుడు మరోమారు లేఆఫ్స్ ప్రక్రియ ప్రారంభమైంది. టెక్ దిగ్గజ కంపెనీ అయిన అమెజాన్ (Amazon) తన ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. వేల మంది ఉద్యోగులకు ఇంటికి పంపేందుకు (Layoffs) రెడీ అవుతోంది. కంపెనీ సీఈవోనే స్వయంగానే ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం. దీంతో వేల మంది జీవితాలు రోడ్డు మీద పడబోతున్నాయి.
2023 జనవరి ఉద్యోగుల తొలగింపు ఉంటుందని అమెజాన్ స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ నెలలో కూడా అమెజాన్ వేలాది మంది ఉద్యోగులకు ఇంటికి పంపించింది. ఇప్పుడు మళ్లీ తొలగింపు ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ ఈ విషయాన్ని తెలియజేశారు. ఉద్యోగులకు లేఆఫ్స్ గురించి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల నేపథ్యంలో వార్షిక మదింపు ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆయన వివరించారు.
2 గంటల్లో బ్యాటరీ ఫుల్.. 200 కిలోమీటర్లు వెళ్లొచ్చు! ఎలక్ట్రిక్ బైక్ అదిరింది!
ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జనవరి 18 నుంచి ప్రారంభం అవుతుందని ఆండీ జస్సీ తెలిపారు. మెయిల్ ద్వారా తొలగింపు అంశాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. అంటే ఎవరైతే ఉద్యోగం కోల్పోబోతున్నారో.. వారికి లేఆఫ్ మెయిల్ వస్తుంది. వివిధ డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆండీ జస్సీ తెలిపారు. అమెజాన్ స్టోర్స్, పీఎక్స్‌టీ ఆర్గనైజేషన్స్‌లోనే ఎక్కువ ఉద్యోగుల తొలగింపు ఉండొచ్చని తెలుస్తోంది.
ఒక్కసారి చార్జింగ్ పెడితే 320 కి.మి. వెళ్లొచ్చు.. టాప్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Our CEO Andy Jassy just shared a message to Amazon employees. https://t.co/cw5Dl6WY84
— Amazon News (@amazonnews) January 5, 2023
ఉద్యోగుల తొలగింపు బాధకరమైన అంశమని, అయినా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి మద్దతు అందించేందుకు పని చేస్తున్నామని వివరించారు. వారికి సెపరేషన్ పేమెంట్, ట్రాన్సిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, ఎక్స్‌టర్నల్ జాబ్ ప్లేస్‌మెంట్ సపోర్ట్ వంటివి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఎవరైనా తొలగింపు లిస్ట్‌లో ఉన్నారో వారితో నేరుగా ఈ విషయం తెలియజేయాలని అనుకున్నామని, అయితే తమ టీమ్‌లోని ఒకరి వల్ల ఈ విషయం బయటకు లీక్ అయ్యిందని, అందుకే ఇప్పుడు అందరికీ ఇలా తెలియజేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. జనవరి 18 నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. కాగా కేవలం అమెజాన్ మాత్రమే కాకుండా చాలా కంపెనీలు, స్టార్టప్‌లు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. కరోనా వైరస్ వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితులు పూర్తిగా సమసిపోక ముందే, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఆర్థిక మాంద్యం భయాలు కారణంగా కంపెనీలు లేఆఫ్స్‌కు రెడీ అవుతున్నాయి. ఐటీ కంపెనీల్లో కూడా ఉద్యోగుల తొలగింపు చోటుచేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Employees, IT Employees, Layoffs, Private employee