ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి భయాలు నెలకొన్న నేపథ్యంలో టెక్ కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నాయి. ఇప్పటికే మెటా, ట్విట్టర్(Twitter) వంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను బయటకు పంపాయి. 2022 లో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. 2023లో కూడా నిరుద్యోగులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) 2023లో కూడా ఉద్యోగుల లేఆఫ్స్ (Layoffs) కొనసాగుతాయని స్పష్టం చేసింది. కొద్దిరోజుల క్రితం ఈ కంపెనీ తన సంస్థలోని ఎంప్లాయిస్‌ని చాలా వరకు తొలగించింది. ఈ ఉద్యోగుల కోత ప్రక్రియ వచ్చే ఏడాదిలో కూడా కంటిన్యూ అవుతుందని అమెజాన్.కామ్ సీఈఓ ఆండీ జెస్సీ (Amazon CEO Andy Jassy) తెలపడం ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
2023లోనూ ఉద్యోగాల కోత
ప్రస్తుత ప్రతికూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా అమెజాన్ 2023లో ఉద్యోగాలను తీసేయడం కొనసాగిస్తుందని... 2023 ప్రారంభంలో ప్రభావితమైన ఉద్యోగులు, సంస్థలకు వివరాలు తెలియజేస్తామని అమెజాన్.కామ్ సీఈఓ ఆండీ జెస్సీ ఒక లేఖలో పేర్కొన్నారు. యాన్యువల్ ప్లాన్ ప్రక్రియ వచ్చే సంవత్సరం వరకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు యత్నిస్తుండటంతో మరింత మంది ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని చెప్పారు.
అసాధారణ, అనిశ్చిత స్థూల ఆర్థిక వాతావరణం నడుమ అమెజాన్ కంపెనీ 10,000 లేదా 3 శాతం ఉద్యోగులను తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కంపెనీలోని లీడర్స్ తమ టీమ్స్‌తో కలిసి పని చేస్తున్నారని, తమ వర్క్‌ఫోర్స్ లెవల్స్, భవిష్యత్తులో వారు చేయాలనుకుంటున్న పెట్టుబడులను పరిశీలిస్తున్నారని అమెజాన్ సీఈవో చెప్పారు. కస్టమర్లు, కంపెనీ వ్యాపారాల లాంగ్ టర్మ్ హెల్త్‌కు ముఖ్యమైనది ఏదో వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ సవాలుగా ఉన్న వేళ ఈ ఏడాది ఖర్చు తగ్గింపు రివ్యూ చాలా కష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు.
వాలంటరీ బైఔట్ ఆఫర్లు
అమెజాన్ హార్డ్‌వేర్ చీఫ్ డేవ్ లింప్ మాట్లాడుతూ.. ఖర్చు తగ్గింపు సమీక్షల తర్వాత కొందరు ఉద్యోగులు అవసరం లేదని తేలిందని అన్నారు. డివైజెస్ & సర్వీసెస్ సంస్థ నుంచి టాలెంటెడ్ ఉద్యోగులను కోల్పోతున్నామని తెలుసని, ఈ వార్తను తెలియజేయడం ఎంతో బాధని కలిగిస్తోందని చెప్పారు.
అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ డివిజన్‌తో సహా దాని టాప్ డిపార్ట్మెంట్ల నుంచి ఉద్యోగులను తొలగించిందని.. దాని హ్యూమన్ రిసోర్సెస్ ఉద్యోగులకు స్వచ్ఛందంగా జాబ్ మానేసే (వాలంటరీ బైఔట్) ఆఫర్లను కూడా పంపిందని ఒక రిపోర్ట్ వెల్లడించింది. వివిధ ఫెసిలిటీస్లోని డేటా సైంటిస్టులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర కార్పొరేట్ ఉద్యోగుల్లో దాదాపు 260 మందిని తొలగించనున్నట్లు కంపెనీ కాలిఫోర్నియాలోని ప్రాంతీయ అధికారులకు తెలియజేసిందని కూడా సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.