Amazon Offer: సర్వేలో పాల్గొనండి.. రివార్డు పొందండి.. అమెజాన్ బంపర్ ఆఫర్..!

ఈ కామర్స్ వ్యాపారంలో దూసుకుపోతున్న అమెజాన్.. కొత్త అంశంతో వార్తల్లో నిలుస్తోంది. అమెజాన్ లో కాకుండా ఇతర ఈ కామర్స్ సైట్లలో ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు.. తాము అడిగే ప్రశ్నలకు స్పందిస్తే వారికి ఊహించని రివార్డ్ ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది.

news18
Updated: October 22, 2020, 12:52 PM IST
Amazon Offer: సర్వేలో పాల్గొనండి.. రివార్డు పొందండి.. అమెజాన్ బంపర్ ఆఫర్..!
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 22, 2020, 12:52 PM IST
  • Share this:
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఒక కొత్త అంశంతో వార్తల్లో నిలుస్తోంది. అమెజాన్ లో కాకుండా ఇతర సంస్థల్లో ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న కస్టమర్లు, తాము అడిగే సర్వే ప్రశ్నలకు స్పందిస్తే రివార్డ్ ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి అమెజాన్ షాపర్ ప్యానెల్ అని పేరు పెట్టారు. అమెజాన్ కాకుండా ఇతర గ్రాసరీ స్టోర్లు, డిపార్ట్మెంటల్ స్టోర్లు, మెడికల్ షాపులు, ఎంటర్‌టైన్‌మెంట్ అవుట్‌లెట్లలో ఏదైనా కొన్నవారు ప్రతి నెలా 10 రశీదులను పంపాలని అమెజాన్ వినియోగదారులను కోరుతుంది. ఇప్పటికే  భారత్ లో ఫెస్టివెల్ సేల్స్ తో దుమ్ము రేపుతున్న అమెజాన్.. తాజాగా ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. కాగా, కొత్తగా  ప్రకటించిన ఈ ఆఫర్ పై  విదేశాలలో వినియోగదారులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతం అమెజాన్ ఆహ్వానించిన కస్టమర్లకు, అది కూడా అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. సంబంధిత కస్టమర్లు అమెజాన్ షాపర్ ప్యానెల్ యాప్‌ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. ఈ యాప్‌ iOS, Androidలో లభిస్తుంది. ఆసక్తి గల వినియోగదారులు ఇన్విటేషన్ కోసం యాప్‌లో వెయిట్‌లిస్ట్‌లో చేరవచ్చు. కస్టమర్లు తాము కొన్న సరకులు, వస్తువులకు సంబంధించిన రసీదులను యాప్‌ ద్వారా ఫోటోలు తీసి receipts@panel.amazon.com కు మెయిల్ చేయాలి. అనంతరం ఆయా ఉత్పత్తులకు సంబంధించిన ప్రశ్నలను సర్వేలో అడుగుతారు. ఇలా సర్వేలో పాల్గోన్నవారికి పది డాలర్లను అమెజాన్ పే బ్యాలెన్స్‌కు క్రెడిట్ చేస్తారు. వారు పూర్తి చేసే ప్రతి సర్వేకు ప్రతి నెలా అదనపు రివార్డులు పొందవచ్చని అమెజాన్ తెలిపింది.

సమాచారం ఎలా సేకరిస్తారు..?
వినియోగదారులు ఎలాంటి బ్రాండ్లు, ప్రొడక్ట్లపై ఆసక్తి చూపిస్తున్నారనే వివరాలను సర్వేలో అడుగుతారు. ఆయా సంస్థలకు చెందిన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఎంత అవకాశం ఉందనేది నమోదు చేస్తారు. కొన్ని సంస్థలు ఇచ్చే ఎడ్వటైజ్‌మెంట్లు ఎలా ఉన్నాయి, అలాంటి యాడ్స్ వల్ల కస్టమర్లు ఎంతమేరకు ప్రభావితమవుతారనే వివరాలను సేకరిస్తారు. సర్వేను బట్టి రివార్డులు మారుతాయని అమెజాన్ తెలిపింది.

ఎడ్వటైజర్లకు ఉపయోగం :
ప్రకటనదారులకు (ఎడ్వటైజర్లకు) ఈ డేటా ఉపయోగపడనుంది. ప్రకటనలు, కొనుగోళ్ల మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి అమెజాన్ ఈ డేటాను సేకరిస్తోంది. ఎలాంటి ఉత్పత్తులు, బ్రాండ్లపై కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారేదానిపై అమెజాన్ మోడళ్లను రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రొడక్ట్ లపై అభిప్రాయాన్ని సేకరించి, ఆ డేటాను వివిధ బ్రాండ్లకు అందిస్తామని అమెజాన్ ప్రకటించింది.

సేవలను మెరుగుపరచడానికి వాడతారు :

వినియోగదారులు అప్‌లోడ్ చేసిన రశీదుల్లో ఏదైనా సున్నితమైన సమాచారం (సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌) ఉంటే, దాన్ని తొలగిస్తామని అమెజాన్ తెలిపింది. కానీ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సంస్థ తొలగించదు. అమెజాన్ ప్రైవసీ పాలసీకి అనుగుణంగా కస్టమర్ల వ్యక్తిగత డేటాను నిల్వ చేస్తుంది. గతంలో పంచుకున్న రసీదులు, వ్యక్తిగత సమాచారం వంటి డేటాను తొలగించే ఆప్షన్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచారు. అమెజాన్ వెబ్‌సైట్, అమెజాన్‌ ప్రైమ్ వంటి సేవలను మెరుగుపరచడానికి ఈ డేటాను ఉపయోగించుకుంటామని ఆ సంస్థ ప్రకటించింది.
Published by: Srinivas Munigala
First published: October 22, 2020, 12:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading