Home /News /business /

AMAZON INSULTS NATIONAL FLAG TRENDING ON TWITTER MK

Amazon Insult National Flag: అమెజాన్‌లో జాతీయపతాకానికి అవమానం, ట్విట్టర్‌లో మండిపడుతున్న నెటిజన్లు...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ భారత జాతీయ పతాకాన్ని తీవ్రస్థాయిలో అవమానించింది. రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ వెబ్‌సైట్‌లో భారత జాతీయ పతాకం ముద్రతో ఉన్న పలు ఉత్పత్తులను విక్రయానికి పెట్టింది. అయితే దీన్ని గమనించిన నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

ఇంకా చదవండి ...
    ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ భారత జాతీయ పతాకాన్ని తీవ్రస్థాయిలో అవమానించింది. రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ వెబ్‌సైట్‌లో భారత జాతీయ పతాకం ముద్రతో ఉన్న పలు ఉత్పత్తులను విక్రయానికి పెట్టింది. అయితే దీన్ని గమనించిన నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ అంశంపై స్పందించిన నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #Amazon_Insult_National_Flag  పేరిట ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. అమెజాన్ భారత జాతీయ పతాకాల ముద్ర ఉన్న ఉత్పత్తులను అమ్ముతున్నట్లు ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. జాతీయ పతాకం ముద్రతో ఉన్న కమర్షియల్ ఉత్పత్తులను అమ్ముతున్నందుకు అమెజాన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే అమెజాన్ ఉత్పత్తులను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. వెంటనే అమెజాన్‌పై పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.





    ఇక గతంలో కూడా కెనెడాలోని అమెజాన్ వెబ్‌సైట్‌లో భారత జాతీయ పతాకం ముద్రతో ఉన్న పలు డోర్ మ్యాట్‌లను విక్రయానికి పెట్టింది. అయితే దీన్ని గమనించిన నెటిజన్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: AMAZON INDIA

    తదుపరి వార్తలు